Phyto Remediation in Soils: మొక్కలు జీవ కోటికి మనుగడ వనరు. ఆహారంగా కానీ గూడు కొరకు గాని, బట్ట కొరకు గాని ఏది అయినా చివరకు అందించేది మొక్కని. దేవుడికి లేని శక్తి కూడా మొక్కకు ఉందేమో అన్న విధంగా అద్భుతాలు జరుగుతాయి. ఎడారిని సైతం హరిత వనంగా మార్చగల సత్తువ ఉన్నది కేవలం మొక్కకే. ఈ మొక్కలు సాగుకిపనికి రాణి బంజరు భూములను, సమస్యాత్మకంగా ఉన్న భూములను కూడా సాగు అనుకూలించే విధంగా మార్చగలవు అంటే నమ్ముతారా ? మొక్కలను ఉపయోగించి నేలలను బాగుచేయు పద్దతిని ఫైటోరేమీడియేషన్ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పద్దతిని మొదట నమ్మకపోయినా దీని దీర్ఘకాల ఫలితాల వలన అవాక్కు అవుతున్నారు. ఈ సందర్బములో ఫైటోరేమీడియేషన్ పద్ధతిలో ఉపయోగించే మొక్కల గురించి తెలుసుకుందాం.
- ఆవాలు (బ్రాసికా జున్సియా L.): బ్రాసికేసి జాతులు కొన్ని లోహాలను సేకరించేందుకు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియలో అధిక మొత్తంలో బయోమాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. భారతీయ ఆవాలు ఫైటోరేమీడియేషన్ లో స్టార్ గా శాస్త్రవేత్తలు పిలుస్తారు. ఇది ఇతర వాటి కంటే మూడు రెట్లు ఎక్కువ కాడ్మియంని తీసివేయగలదు, లెడ్ 28%, సెలీనియం 48% వరకు తగ్గిస్తుంది. అలాగే Zn, Hg మరియు Cuలకు వ్యతిరేకంగా కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
- విల్లో (సాలిక్స్ ఎస్పి.) (వైట్ విల్లో): వేర్ల శోషణ ద్వారా నెలలో పేరుకుపోయి ఉన్న భారీ లోహాలు తక్కువ స్థాయికి తీసుకుని వస్తాయి. అవి కాడ్మియం, లెడ్, సెలీనియం తో వ్యవహరిస్తాయి మరియు డీజిల్ ఇంధనం కలుషిత ప్రదేశాలను, మిశ్రమ భారీ లోహాలలో కూడా నెల నుండి తీసివేయడానికి పని చేస్తాయి.
-
పోప్లర్ ట్రీ (పాపులస్ డెల్టోయిడ్స్): ఇది వేర్ల నుండి ఒక రకమైన స్రవంను నేలలోకి విడుదల చేసి సహజంగా భారీ లోహాలతో పాటు పెద్ద మొత్తంలో నీటిని తీసుకుంటుంది.
- ఇండియానా గడ్డి (సోర్గాస్ట్రమ్ నూటాన్స్) ఇది సాధారణంగా పురుగుమందులు మరియు అట్రాజిన్ మరియు మెటాక్లోర్‌కు సంబంధించిన గడ్డి మందులు, ఇతర వ్యవసాయ రసాయన అవశేషాలను నిర్విషీకరణ చేసే శక్తిని కలిగి ఉంది. ఇది పెట్రోలియం హైడ్రోకార్బన్‌లను నిర్వీర్యం చేయగలదు.
- సన్‌ఫ్లవర్ (Helianthus Annuus L.) ప్రభావవంతమైన మార్గంలో మట్టి నుండి వివిధ PAH స్థాయిలను తగ్గిస్తుంది, అయితే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవి లెడ్, జింక్,కాడ్మియం,కాపర్, మెగ్నీషియం మొదలైన భారీ లోహాలు భూమి నుండి తీసి వేయడానికి తోడ్పడుతుంది.