Mycorrhiza Uses: శిలీంధ్రాలు సాధారణంగా కొన్ని మొక్కలకు దగ్గరగా పెరుగుతాయి. శిలీంధ్రాలు భూమి కింద భారీ నెట్‌వర్క్‌ను (మైసిలియా) ఏర్పరుస్తాయి మరియు పొరుగు మొక్కల మూల వ్యవస్థను కలుపుకుంటాయి. చెట్ల మార్గాల చుట్టూ విస్తృతంగా వ్యాపించిన మైసిలియా ద్వారా శిలీంధ్రాలు భాస్వరం మరియు నత్రజనితో సహా నీరు మరియు ఖనిజాలను గమనించి ఒక్కొక్కటిగా వేరు వ్యవస్థకు అందించగలవు. అక్కడ నుండి ఆకుల్లోకి రవాణా అవుతుంది. అలాగే ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగడం వలన డెక్స్ట్రాజన్ అనే పదార్థం తయారవుతుంది.
ఈ తయారైన పదార్థాన్ని కొంతవరకు వేరు వ్యవస్థ ద్వారా శిలీంద్రాలు ఉపయోగించుకుంటాయి ఇలా మొక్క మరియు శిలీంధ్రాలు ఒకదానికొకటి తోడ్పడతాయి. ఈ సహజీవనాన్నే మైకోరైజా అంటారు. ఒక చెట్టు వేరు వ్యవస్థలో చూసుకున్నట్లయితే దాదాపు 30 రకాల మైక్రోరైజా ఉంటాయి ఇలా వేరు వ్యవస్థలో నెట్ వర్క్ లాగా ఏర్పరచుకొని బలంగా ఉన్న మొక్కల నుండి పోషకాలను బలహీనంగా ఉన్న మొక్కలకు కూడా అందజేస్తాయి.
ఇప్పటి ఆధునిక వ్యవసాయంలో రకరకాల రసాయన ఎరువుల వాడకం వలన ఇలాంటి మొక్కకు తోడ్పడే శిలీంద్రాలు క్షీణించి పోతున్నాయి కావున పర్యావరణాన్ని, భూమిని కాపాడుకునేందుకు అలాగే నాణ్యమైన పంటను తీయడానికి ఇలాంటి శిలీంద్రాలు కలిగిన ఎరువులను వాడుకోవాలి.
Also Read: పంట కాలంలో విపత్కర పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక.!
మైకోరైజా ఉపయోగాలు :
వేరు వ్యవస్థ పెరుగుదల :
. ఈ శిలీంద్రం మొక్క వేగంగా పెరగడానికి మద్దతు చేస్తుంది.
. నీటి శోషణ ప్రాంతాన్ని 50 రెట్లు పెంచుతుంది.
. ఈ శిలీంద్రం మూలవేరు వ్యవస్థకు లోతులో ఉన్న పోషకాలు మరియు నీటిని అందుకొని మొక్కకు ఆకులకు వేరు వ్యవస్థ ద్వారా అందిస్తుంది.
. మొక్కకు పోషకాలు అందుకునే సామర్థ్యం పెంచుతుంది.
. వేర్లకు మరియు మైకోరైజాకు ఉన్న అనుబంధం వలన మొక్క నీటినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వలన మొక్క నీటి ఒత్తిడిని గాని లేదా కరువు గాని వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.
. మైకోరైజా నేల నిర్మాణానికి సచ్చిద్రత మెరుగవడానికి కూడా తోడ్పడుతుంది.
వాడే విధానం :
దుక్కిలో వాడే విధానం : 4 కిలోల మైకోరైజా పొడిని 50 కిలోల బాగా కుళ్ళిపోయిన కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ లేదా పొలం మట్టిలో కలపి మిశ్రమాన్ని ఒక ఎకరం భూమిలో ఏకరీతిగా వేసుకోవాలి. మళ్లీ ఇదే పద్ధతి పంట వేసిన 30 రోజుల తర్వాత పాటించాలి.
విత్తనంతో పాటు కూడా మైక్రోరైజా పొడిని కలిపి వేసుకోవచ్చు. 50 గ్రాముల మైకోరైజా 100 గ్రాముల చక్కరి పాకంలో కలిపి విత్తనానికి పట్టించుకోని విత్తుకోవచ్చు.
Also Read: జంతు క్రూరత్వ నిరోధక చట్టం 1960