నేలల పరిరక్షణ

Calcareous Soils: సున్నం అధికంగా ఉన్న నేలల్లో యాజమాన్యం ఎలా చేపట్టాలి.!

1
Calcareous Soils in India
Calcareous Soils in India

Calcareous Soils: ఈ నేలలను గుర్తించటం చాలా తేలిక. గలస లేదా ప్రత్యేక పొర రూపంలో ఉన్న సున్నాన్ని తేలికగా కంటితో గుర్తించవచ్చు. కంటికి కనిపించని రూపంలో వున్న సున్నాన్ని గుర్తించటానికి 1:4 నిష్పత్తిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నీరు కలిపి ఒక చుక్క మిశ్రమ ద్రావణాన్ని మట్టిపై వేస్తే బుస బుసమనే సురగ వస్తే, సున్నం అధికంగా గల నేలగా గుర్తించవచ్చు. ఈ నేలలో భాస్వరం ఎరుపు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే కాక సూక్ష్మ పోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు సర్వసామాన్యంగా కనిపిస్తాయి.

ఈ సూక్ష్మ పోషకాలు ఎరువుల రూపంలో వేస్తే సమర్థవంతంగా పైరులో లోపాలను సరిదిద్దలేవు. ఫలితంగా నేలల్లో వేసే పంటల దిగుబడి, నాణ్యత బాగా దెబ్బతింటాయి. కనుక పైరుపై పిచికారీ చేయటం మంచిది.

ఎకరాకు 4 tones పశువుల ఎరువును వేసి పంట నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చిరొట్ట పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగి లా వేస్తే సున్నపు దుష్ప్రభావాలు కొంత వరకు తగ్గిపోతాయి.

Calcareous Soils

Calcareous Soils

Also Read: Wanaparthy: ఒక చారిత్రక సందర్భానికి వనపర్తి నాంది పలికింది- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

భాస్వరం ఎరువును చేలో వెదజల్లకుండ పైరును సాలుల్లో విత్తేటప్పుడే గింజకున్న 5 సెంటీ మీటర్ల లోతు మరియు 5 సెంటీ మీటర్ల పక్కన పేడలా విత్తనం మరియు ఎరువును ఒకేసారి చేసే ‘సీడ్కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్”. ద్వారా వేయాలి. ప్రత్యామ్నాయంగా భాస్వరంతో పటిష్టపరచిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ను కూడా వాడి భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

ఈ నేలల్లో పెరిగే నిమ్మ, నారింజ తోటల్లో ఇనుము లోపం వల్ల సామాన్యంగా పల్లాకులు కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించటానికి జనుమును పచ్చిరొట్ట పంటగా పెంచి పాదులో వేసి మరిగనిస్తే, పోషకలోపాలు ముఖ్యంగా ఇనుము లోపం తగ్గుతుంది. దీనితోపాటు ప్రతిపాదులో 25 కిలోల పశువుల ఎరుపు మరియు 125 గ్రాములు అన్నభేదిని వేస్తే, ఇనుము లోపం సవరించబడుతుంది.

ఈ నేలల్లో వేసిన నిమ్మ, నారింజ తోటల్లో బహుళ సూక్ష్మ మరియు ఇతర పోషకాల లోపాలు విస్తారంగా కనపడతాయి. వీటిని సవరించటానికి ఈ క్రింది పోలీఫీడ్ మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పక్షం వ్యవధిలో పిచికారీ చేయాలి. జింకు సల్ఫేట్ 5 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, బోరాక్స్ 1 గ్రా., సున్నం 6 గ్రా. మరియు యూరియా 10 గ్రా.

Also Read: Bio Fertilizers Importance in Agriculture: వ్యవసాయంలో జీవన ఎరువుల వాటి ప్రాముఖ్యత.!

Leave Your Comments

Wanaparthy: ఒక చారిత్రక సందర్భానికి వనపర్తి నాంది పలికింది- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Previous article

Avian Encephalomyelitis in Poultry: కోళ్ళలో ఎవియన్ ఎన్సెఫలోమైలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Next article

You may also like