పట్టుసాగుమన వ్యవసాయం

Mulberry Cultivation: నూతన పద్ధతిలో మల్బరీ మొక్కల పెంపకం

1
Mulberry Cultivation
Mulberry Fruits

Mulberry Cultivation: పట్టు పురుగుల పెంపకంలో, మల్బరీ మొక్కలను వాణిజ్యపరంగా ఎతైనా లేక చదునైన నారు మడుల నుండి అంటు మొక్కలుగా ఉత్పత్తి చేస్తారు.మొక్క బాగా మొలకెత్తడానికి మరియు బలంగా ఉండడానికి, పోటీగా పెరిగే కలుపు మొక్కలు, నేలలోని తేమ, మరియు నేల ఉష్ణోగ్రత వంటివి ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో, కలుపు తీయడానికి, నీరు మరియు కార్మికుల అందుబాటు, ఖర్చు అడ్డంకులుగా ఉండడం వలన, ఈ సమస్యలను అధిగమించేందుకు ఫాలీధీన్ షీట్లను ఉపయోగించి మల్బరీ మొక్కలను పెంచడం అన్న నూతన పద్ధతి అభివృద్ధి పరచడమైనది. వాణిజ్య అవసరాలకు, ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా విజయవంతమై, శ్రేష్టమైన మల్బరీ మొక్కలను ఉత్పత్తి చేయడంలో మంచి ప్రభావం చూపుతున్నది.

Cultivation Of Mulberry Plants

Cultivation Of Mulberry Plants

పద్ధతి: – 30 నుండి 40 సెం.మీ. ల లోతుకు నేలని దున్నిన తరువాత, 8 నుండి 10 మెట్రిక్ టన్నుల పొలంలో తయారు చేసిన ఎరువును, నేలకి అందజేసి, చదును చేయాలి. నారుమడుల రెండు వైపులా, 3/ 4 వ వంతు ఉమ్మడిగా సాగునీటి కాలువలను ఏర్పరచి సిద్ధం చేయాలి. 15 అడుగులు x 5 అడుగుల పరిమాణంలో నల్లని ఫాలీధీన్ షీట్లను కత్తిరించి నారుమడి పై ఉంచాలి. 6 నుండి 7 మాసాల వయసు కల వ్యాధులు లేని మల్బరీ అంటుమొక్కలను ( 16 నుండి 20 సెంమీ. పోడుగుతో 3 చిగుర్లు కలిగినవి) ఫాలీధీన్ తో కప్పిన నారుమడి నేలలోనికి 10 సెం.మీ. x 10 సెం.మీ. ఎడం యిచ్చి నాటాలి. వారానికి లేదా పదిరోజులకు ఒకసారి, ఆ ప్రాంతపు నేల యొక్క స్వభావాన్ని బట్టి, కాలువలలో సాగునీరును ఫాలీధీన్ కే అందజేయాలి.

Also Read: మల్బరీ పంట సాగులో మెళుకువలు

లాభాలు:  ఈ పద్ధతిలో, కలుపు మొక్కలను సూర్యరశ్మి సోకకపోవడం వలన పూర్తిగా నిర్మూలించవచ్చు. మొలకలు ఎదుగుతున్న దశలో (నాలుగు నెలలు) పూర్తి కాలంలో కలుపు తీసే అవసరమే రాదు. ఈ విధంగా, మనుషులను ఏర్పాటు చేసి తీసే కలుపు మొక్కలకయ్యే అధిక ఖర్చు కలిసి వస్తుంది.

ఎదుగుతున్న మల్బరీ మొక్కలతో పాటు పోటీగా కలుపు మొక్కలు లేకపోవడం వలన, మల్బరీ మొక్కలు నేలలోని పోషకాలన్నీ అవే వాడుకుని, ఎక్కువ శక్తితో ఎదిగి మంచి శ్రేష్టత కలిగిన మొక్కలను అందిస్తాయి. వేరే పద్ధతుల వలె కాక నీటి సదుపాయాన్ని 50 శాతం తగ్గించవచ్చు. ఎందుకంటే నేల పై పరచిన పాలీధీన్ కవర్ నేల ఉష్ణోగ్రత్తను సాధ్యమైనంతగా తగ్గించి వేస్తుంది. మరియు నీటిని ఆవిరి కాకుండ నిరోధిస్తుంది. అందువలన, నేల తేమ సంరక్షింపబడుతుంది.

రాబడి: – ఈ పద్ధతిలో నాలుగు నెలల కాలంలో,ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇతర పద్ధతుల కంటె ఈ విధానంలో, సగటు ఆదాయం 50000/- రూలు అధికంగా వస్తుంది.

Also Read: పట్టుపురుగుల పెంపకం – సస్యరక్షణ

Leave Your Comments

Bacterial Diseases in Pomegranate: దానిమ్మలో వచ్చే బాక్టీరియా తెగులు మరియు దాని యజమాన్యం

Previous article

China Education: చైనా విద్యార్థులకు పందులను బహుమతిగా ఇచ్చిన టీచర్లు

Next article

You may also like