Organic Forming సేంద్రీయ వ్యవసాయం ఇది నేలలు పర్యావరణ వ్యవస్థలు మరియు ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టే ఉత్పత్తి వ్యవస్థ. ఇది ప్రతికూల ప్రభావాలతో కూడిన ఇన్పుట్లను ఉపయోగించడం కంటే పర్యావరణ ప్రక్రియలు, జీవావైవిధ్యం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే చక్రాలపై ఆధారపడుతుంది. సేంద్రీయ వ్యవసాయం సంప్రదాయం, ఆవిష్కరణలు మరియు విజ్ఞాన శాస్త్రం మిళితం చేసి భాగయస్వామ్య పర్యావరణం ప్రయోజనం చేకూరుస్తుంది.
సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా, సేంద్రీయ కూరగాయల వ్యవసాయం కృత్రిమ ఎరువులు మరియు పురుగు మందులపై ఆధారపడకుండా వ్యవసాయంలో సహజ వైవిధ్యం మారియు జీవచక్రాల ప్రోత్సహిస్తుంది. సేంద్రీయ వ్యవసాయాన్ని స్వయం సంమృద్ధిగా మరియు స్ధిరంగా చేయడం పై ఆధారపడి ఉంటుంది.
సేంద్రీయ కూరగాయల సాగు ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది,సుస్థిర వ్యవసాయఅభివృద్ధికి, నేల జీవ సంబంధ కార్యకలాపాల నిర్వహణకు, రసాయన ఎరువులు మరియు పురుగు మందులు అవశేష ప్రభావాన్ని తగ్గించడం మరియు మానవ జీవితం, వన్యప్రాణులు మరియు పర్యావరణాన్ని సంరక్షించే ఆహార నాణ్యతను మెరుగుపరచడం కోసం.
ఈ మధ్య కాలంలో ప్రజలలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల పై అవగాహన పెంచుకొన్ని ఆ వస్తువులను ఎక్కువగ్గా కొనుగోలు చేస్తునారూ. డాక్టర్లు కూడ ఆర్గానిక్ పదార్ధలును తీసుకోమని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అందువల్ల ఈ యొక్క ఉత్పత్తుల డిమాండు బాగా పెరిగింది. కొన్ని సంస్థలు రైతులకు ఈ సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి అన్నీ చెప్పి వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను తమ సంస్థలు ద్వారా ప్రజలకు అందిస్తునారు.
అందుకే రైతులు ప్రస్తుతం ఈ సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు . యిందువల్ల ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్ధలు లాభిస్తున్నాయి. సేంద్రీయ వ్యవసాయా ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాం పెరుగుతుంది. ఇంకా రసాయన వాడకం తక్కువ అవడం వల్ల భూమి కాలుష్యన్ని తగ్గించవచ్చు. అందువల్ల పర్యావరణాన్నికి ఎంతో మేలు జరుగుతుంది.