ప్రకృతి సేద్యం ఆరోగ్యవంతమైన సమాజానికి సరైన మార్గమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ ఏర్పడింది. దీంతో చాలామంది సహజ సిద్దమైన సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణ రైతులతోపాటు యువకులు కూడా ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజంలో తాము కూడా భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో ఒకరివెంట మరొకరు ముందడుగు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నవారా, నారాయణకామిని, మాపిళ్ళై సాంబ, గంథసాల, తులసీబాసో, అక్కుళ్ళు ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా.. ఇవన్నీ మన పూర్వీకులు పండించిన వరి వంగడాల రకాలు ఇలాంటివి 6 లక్షల రకాలు ఉండేవని సమాచారం. ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో పరిశోధించగా కేవలం 5 వేల రకాలు మాత్రమే కనిపిస్తున్నాయని దేశీయ విత్తన పరిశోధకులు చెబుతున్నారు. చాలామంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నా దేశీయ విత్తనాలు వినియోగించేవారు తక్కువగా ఉంటున్నారు. కొత్తగా వ్యవసాయం చేయాలన్న ఆసక్తితో ముందుకు వచ్చే యువత మాత్రం దేశీయ విత్తనాలనే సాగు చేస్తూ ఇతరులకు వాటి ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రకృతి సేద్యం
Leave Your Comments