Elephant Foot Yam: ఈ మధ్య కాలంలో రైతులు కూరగాయల పంటలకి ఎక్కువ ప్రదాయం ఇస్తున్నారు. ఇంటి బయట, మీద తోటల ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు. అలాంటి పంటలో కంద సాగు ఒకటి. ఈ కంద పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో సాగు చేస్తారు , తెలంగాణాలో ఎక్కువ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. ఈ పంట సాగు మే, జూన్ నెలలో మొదలు పెడతారు. గోదావరి జిల్లలో నవంబర్, డిసెంబర్ నెలలో కూడా కంద నాటుకోవచ్చు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 30 టన్నుల వారికి దిగుబడి వచ్చి మంచి లాభాలు వస్తాయి.
కందను ఎక్కువగా కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వాడుతారు. కందలో ఎక్కువ పిండిపదార్ధాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఎ, విటమిన్ బి ఉంటాయి. మన ప్రాంతంలో ఆకువగా గజేంద్ర అనే కంద రకం సాగు చేస్తారు. కంద పంట కాలం 7-8 నెలలు. కంద సాగులో వితనం ఖర్చు ఎక్కువ, ఎకరాకి 6-7 టన్నుల విత్తనం వాడుతారు.
ఈ విత్తనం వేరే రైతుల నుంచి లేదా ముందు పంట నుంచి విత్తనాలు తీసుకొని మళ్ళి పంటకి వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా విత్తన ఖర్చు తగ్గించవచ్చు. నకిలీ విత్తనాలు, రవాణాలో విత్తనం దెబ్బ తిని మొలక అతీతే రైతులకి నష్టం వస్తుంది. ఇలాంటి ఇబంధులు లేకుండా పండించిన పంట నుంచి కొంత పంట విత్తనాల కోసం దాచుకుంటే రైతులకి చాలా ఉపయోగపడుతుంది.
Also Read: Miyazaki Mango: ఒక కిలో మామిడి పండ్లలు 2. 70 లక్షలు… ఎలా సాగు చేయాలో తెలుసుకోండి.!
కంద సాగుకు నీళ్లు నిలువ ఉందని పొలం వాడటం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కంద సాగుకు నేలని 2 నుంచి 3 సార్లు దున్నుకోవాల్సి ఉంటుంది. నెలలో పశువుల ఎరువు వాడటం కూడా కంద పంట బాగా వస్తుంది. విత్తనం కోసం కంద దుంప బరువు 300-500 గ్రాములు ఉండాలి.
కంద పంటకి ఎలాంటి తెగుళ్లు రాకుండా ముందే విత్తనాన్ని 10లీటర్ల నీటికి 50గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, 25మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి, ఆ నీతిలో దుంపలను 15నిమిషాలు ఉంచి, తరువాత నాటుకోవాలి. మొక్కల మధ్య,పొలంలో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు దూరంతో రెండు ఇంచులు లోతులో నాటుకోవాలి. కంద పంటలో కలుపు కోసం ఎకరాకు 2లీటర్ల బ్యుటాక్లోర్ లేదా 1లీటరు పెండిమిథాలిన్ 200లీటర్ల నీళ్లతో కలిపి, పొలంలో పిచికారీ చేసుకోవాలి.
కంద పంటకి వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి పంటకి నీళ్లు అందించాలి. ఈవిధంగా ప్రతి దశలోను రైతులు జాగ్రత్తలు పాటిస్తే 7,8నెలలకు పంట కోతకు వస్తుంది. ఎకరాకు 70 నుంచి 110 టన్నులు వరకి దిగుబడి వస్తుంది. కంద పంటిని కొబ్బరి, అరటి తోటలో అంతర పంటగా సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి.
Also Read: ANGRAU: ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విత్తన మహోత్సవం