Pruning: చెట్టు కొమ్మలు చాలా దగ్గరగా ఉండి, సూర్య రశ్మి సరిగా సోకనప్పుడు లోపలి కొమ్మలలో సరిగా పూత కత ఉండదు.కనుక అధిక సంఖ్యలో గల అల్లిబిల్లిగా పెరిగిన కొమ్మలను కత్తిరించడం ద్వారా సూర్య రశ్మి మిగిలిన కొమ్మలను సరిగ్గా సోకి వాటి ఉత్పాదక శక్తి పెరుగుతుంది.
శీర్షపు మొగ్గను తొలగించుట వలన చెట్టు ఎత్తు తగ్గుతుంది.అంతే కాక ప్రక్క శాఖీయ మొగ్గలు పెరుగుతాయి. కొమ్మల కత్తిరింపు ద్వారా ప్రధాన కాండం ప్రక్క కొమ్మల మధ్య కోణాన్ని మార్చవచ్చు. ఈ కోణం మరి చిన్నగా ఉంటే కొమ్మ మీద బయట వైపుకు ఉండే మొగ్గకు పైన కత్తిరించాలి.కోణం పెద్దదిగా ఉంటే లోపలి వైపు మొగ్గకు పైన కత్తిరించాలి.
చెట్టు వయసు పెరిగి లేదా దెబ్బతిని కాపు తగ్గినప్పుడు మాత్రమే పెద్ద కొమ్మలను నరకాలి.దీని వలన బలమైన కొత్త కొమ్మలు ఏర్పడి పూత కతా బాగుంటుంది.
పెద్ద కొమ్మలను నరకడం వలన కాండం మీద చాలా కాలంగా నిద్రాణ స్థితిలో గల శాఖీయ మొగ్గలు చిగురించి, బలమైన కొమ్మలుగా పెరిగి చెట్ల మధ్య ఖాళీలను పూర్తి చేస్తాయి.
Also Read: Banana Cultivation: అరటిలో పిలకల తయారీ మరియు నాటడం.!
కొమ్మల కత్తిరింపుల సమయంలో లేదా తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెట్టు పూత కతా దశలో ఉన్నప్పుడు కొమ్మలు కత్తిరించరాదు చెట్టు పెరుగుదల జీవ క్రియల వేగం తక్కువగా ఉన్న దశలో చేయాలి.
కత్తిరింపులు జరిపిన తర్వాత ఏర్పడే గాయల ద్వారా శీలింద్ర నాశక మందు పూత పూయాలి. చెట్టు కొమ్మలు కత్తిరించడానికి పదునైనా కత్తి వాడాలి.బేరాడు చిలి పోకుండా జాగ్రత్త పడాలి. చీడ పిడలు / వైరస్ ఆశించిన చెట్లను నరికిన కత్తితో ఆరోగ్యకరమైన చెట్టు కొమ్మలను నరకరాదు.కత్తిని చూశాక మాత్రమే వాడాలి.
కొమ్మ కత్తిరింపులో రకాలు:
డిస్ బడ్డింగ్ (dis budding): కొన్నిటిలో కాండం మీద అవసరమైన చోట వచ్చే కొమ్మలు మొగ్గ దశలోనే తుంచి వేయటాన్ని డిస్ బడ్డింగ్ అంటారు.అలాగే కొన్ని పూల మొక్కలలో పూల సైజు పెంచడానికి, పూల సంఖ్య తగ్గించడానికి మొక్కలను తుంచి వేయడాన్ని కూడా డిస్ బడ్డింగ్ అంటారు.
పించింగ్ (pinching): కొమ్మల చివరి భాగాలను తుంచి వేయడాన్ని పించింగ్ అంటారు.దీని వల్ల కొమ్మల సంఖ్య పెరిగి పూల సంఖ్య తగ్గుతుంది.
టిప్పింగ్(tipping): కొమ్మల పొడవు తగ్గించడానికి కొమ్మ చివరి భాగాన్ని తుంచి వేయడాన్ని టిప్పింగ్ అంటారు.
పోలార్డింగ్(pollarding): పెద్ద చెట్లు ఎత్తు తగ్గడానికి ప్రధాన కాండము 1-2 మీ ఎత్తుకు నరికివేయడాన్ని పోలార్డింగ్ అంటారు.
Also Read: PRUNING: పండ్ల తోటలో కత్తిరింపు కు గల కారణాలు మరియు లక్ష్యాలు