ఉద్యానశోభ

ఫ్యాషన్ ఫ్రూట్ సాగు విధానం..

0

ఫ్యాషన్ ఫ్రూట్ పుట్టిన దేశం బ్రెజిల్. ఇది ఉష్ణమండలపు పంట. కాయలో ఉండే పోషక విలువలు ప్రత్యేకమైన సువాసన వల్ల ఈ కాయలోని గుజ్జు నుండి తయారు చేసే జ్యూస్ కు ప్రత్యేకత ఉంది. అయితే ఈ కాయల నుండి జ్యూస్ తయారుచేసే పరిశ్రమలు అందుబాటులో లేనందున ఈ పండు అంత ప్రాచుర్యంలో లేదు. కాని ముందు ముందు ఈ వాణిజ్య సరళిలో సాగు చేయడానికి మంచి అవకాశం ఉంది. పాసిఫ్లోరా ఎడూలిస్(ఊదా రంగు), పాసిఫ్లోరా ఎడూలిస్ ఫాసికార్బా(పసుపు రంగు)ను క్రిష్ణ ఫలంగా పిలుస్తారు. 

పోషక విలువలు:                                                                                                              ఈ పండులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. కాయ జ్యూస్ లో విటమిన్ ‘ఎ’ మరియు విటమిన్ ‘సి’తో పాటు పోటాషియం, కాల్షియం, ఐరన్, సోడియం వంటి లవణాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. లాటిన్ అమెరికా దేశాల్లో ఫ్యాషన్ ఫ్రూట్ కాయలనే కాక ఆకులను కూడా వివిధ ఔషధ తయారీల్లో వాడతారు. పోషక విలువల వివరాలు కింద ఇవ్వబడినవి(ప్రతి 100 గ్రాములకి). ఫోలేట్ 1.4 మైక్రో.గ్రా., సియాసిన 1.500 మి.గ్రా., పైరిడాక్సిన్ 0.100 మి.గ్రా., రిబోఫ్లావిన్ 0.130 మి.గ్రా., ధయామిన్ 0.00 మి.గ్రా., విటమిన్ ఎ 1274 ఐ.యు, విటమిన్ సి 30 మి.గ్రా., విటమిన్ ఇ 0.02 మైక్రో .గ్రా., విటమిన్ కె 0.05 మైక్రో.గ్రా.,పోటాషియం 348 మి.గ్రా., కాల్షియం 12 మి.గ్రా., ఐరన్ 1.60 మి.గ్రా., మెగ్నీషియం 29 మి.గ్రా., ఫాస్పరస్ 68 మి.గ్రా.

పర్పుల్(ఊదా) రంగు:                                                                                                        ఈ రకం సముద్ర మట్టం నుండి బాగా ఎతైన ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. కాయలు సుమారుగా 45 గ్రా. బరువుండి 4-5 సెం.మీ వ్యాసం కలిగి ఉంటాయి. పైన తోలు ఊదా రంగులో 35 శాతం రసం ఉంటుంది. ఈ రకం మొక్క జ్యూస్ ప్రత్యకమైన వాసన కలిగి ఉంటుంది.

ఎల్లో(పసుపు) రంగు:                                                                                                           ఈ రకం సముద్ర మట్టం నుండి ఎత్తు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం కావు పర్పల్ రకం కన్నా పెద్ద కాయలను కలిగి ఉంటుంది. పర్పల్ రకం కన్నా తక్కువ రసం కలిగి ఎక్కువ పుల్లగా ఉంటుంది.

కావేరి హైబ్రిడ్ రకం:                                                                                                        ఎక్కువ దిగుబడని ఇచ్చేరకం. కాయబరువు 85 గ్రా. వరకు ఉంటుంది. కాయ తోలు  లేత ఊదా రంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది.

సాగుకు అనుకూలమైన వాతావరణం:                                                                                గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఉష్ణ మరియు సమశీతోష్ట పరిస్థితులు అనుకూలం. సముద్రమట్టం నుండి 2,000 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 20-30 సెం.గ్రే వద్ద బాగా పెరుగుతుంది. 15 సెం. గ్రే కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎదుగుదల, పూత తగ్గిపోతుంది. ఉదజని సూచిక 6-7 ఉండే తేలికనేలల్లో, ఎర్రనేలల్లో బాగా పెరుగుతుంది.

ప్రవర్ధనం:                                                                                                                      ఫ్యాషన్ ఫ్రూట్ లో విత్తనం, కాండం మొక్కలు మరియు అంట్ల ద్వారా అభివృద్ధి పరుస్తారు. విత్తనం ద్వారా మొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన మొక్కల నుండి బాగా ఎండిన కాయలు సేకరించి గుజ్జును వేరుచేసి 72 గంటల పాటు బాగా మరగబెట్టి విత్తనాన్ని వేరుచేయాలి. తరువాత విత్తనాన్ని నారుమడిలో నాటిన తరువాత 4-6 ఆకుల దశలో పాలీథిన్ బ్యాగుల్లోకి మార్చుకోవాలి. మూడునేలల్లో ప్రధానపొలంలో నాటడానికి సిద్ధమవుతాయి.కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలంటే మంచి ఆరోగ్యవంతంగా ఉన్న నాణ్యమైన మొక్క నుండి 30-35 సెం.మీ పొడవుండి 3-4 గణుపులు ఉన్న ముదురు కాండం ముక్కలను మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మిశ్రమం కలిపి పాలీథిన్ సంచుల్లో నాటుకోవాలి. ఇవి కూడా మూడు నెలల్లో నాటడానికి సిద్ధమవుతాయి.

నాటడం:                                                                                                                       నాటేదూరం అనేది అవలంభించే ట్రైనింగ్ పద్ధతిని బట్టి ఉంటుంది. సిఫిన్/టెలీఫోన్ పద్ధతిలో 2×3 మీ. పద్ధతిలో నాటుకోవాలి. మామూలు పడిళ్ళ మాదిరిగా అయితే 3×3 మీ. దూరంలో నాటుకోవాలి.

తీగలను పాకించే విధానం (ట్రైనింగ్):ఇందులో ప్రధానంగా మూడు పద్ధతులను అవలంభిస్తారు.
బోదర్ పద్ధతి: పందిరలళ్ళు వేసి పందిళ్ళ మధ్యలో మొక్కలను నాటి పైకి పాకించాలి. పందిరి ఎత్తు వరకు ఒకటి లేదా రెండు తీగలను మాత్రమే పెరగనిచ్చి చివరలను తుంచి పక్కకొమ్మలను నలుదిశలా పాకించాలి.

Y ట్రెల్లీ లేదా టెలిఫోన్ పద్ధతి:                                                                                            ఈ పద్ధతిలో రాతి లేదా సిమెంట్ లేదా ఇనుప కడ్డీలను వరుసగా పాకిపైన టెలిఫోన్ స్థంబాలకు ఉన్నట్లు లేదా కొద్దిగా వంగి ఉండే ఇనుప బద్దలను అడ్డంగా అమర్చి వాటిపై జిఐ తీగలను ఏర్పాటు చేస్తారు. వాటి మీదకు కొమ్మలు పాకేలా చేయాలి.

నిఫాన్ పద్ధతి:                                                                                                                  ఈ పద్ధతిలో సిమెంట్ లేదా ఇనుప కడ్డీలకు 3-4 వరుసల జిఐ తీగలను అమరుస్తారు. ప్రధాన కాండం పై నుండి వచ్చే పక్క తీగలు ఈ జిఐ తీగల మీదకీ పాకిస్తారు.

కత్తిరింపులు:                                                                                                                ఫ్యాషన్ ఫ్రూట్ కొత్తగా వచ్చిన కొమ్మలపై కాపును ఇస్తుంది. కాబట్టి కాలానుగుణంగా కత్తిరింపులు చేపడుతూ ఎక్కువ మొత్తంలో కొత్త చిగురల్లు వచ్చే విధంగా చేయాలి. కాపు అయిపోయిన వెంటనే అన్ని కొమ్మలు లేదా తీగలను నాలుగు లేదా ఐదు కణుపులు మాత్రం ఉంచి మిగతా మొత్తం కత్తిరించాలి.

కోత మరియు దిగుబడి:                                                                                                      మొక్కలు నాటిన 8-10 నెలల్లో కాపు ప్రారంభం అయినప్పటికీ 16-18 నెలలు వయస్సు నుండి మంచి దిగుబడినిస్తాయి. తయారైన కాయలు మొక్కలపై నుండి రాలి కింద పడతాయి. సాధారణంగా మొక్కకు 150-200 వరకు కాయల దిగుబడి వస్తుంది.

Leave Your Comments

కవర్ టెక్నాలజీతో.. మామిడిలో దిగుబడి

Previous article

జెర్బరా పూల సాగు.. ఎంతో లాభం

Next article

You may also like