Vegetables Cultivation: రైతులు ఎక్కువగా తన పొలం మొత్తం ఒకటే పంట వేసి, పంట దిగుబడి సరిగా రాకపోవడం వల్ల నష్టపోతుంటారు. రైతులకి ఎలాంటి నష్టం రాకుండా ప్రతి రోజు దాదాపు 2 నుంచి 4 వేల రూపాయల ఆదాయం వచ్చేల రైతు సురేందర్ గారు తనకి ఉన్న తక్కువ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. సురేందర్ గారికి కేవలం 5 ఎకరాల పొలం ఉంది. అందులో ఒక ఎకరంలో దాదాపు 20 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు.
ఈ రైతు ఒక ఎకరం పొలాన్ని సమానంగా విభజించుకుని. ప్రతి ఒక గుంట లేదా గుంత నార పొలంకి ఒక రకం కూరగాయ వేసుకున్నారు. ఒక ఎకరంలో మిరపకాయ, టమాట, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, రెండు రకాల వంకాయ, ఆకుకూరలు, పాలకూర, ముల్లంగి ఇలా ఎన్నో రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒకటే పొలంలో ఇన్ని రకాల కూరగాయలు సాగు చేయడం ద్వారా కలుపు తాగుతుంది. ఎక్కువ మందులు పిచుకరీ అవసరం ఉందదు.
Also Read: నిమ్మ పూత దశలో పాటించవలసిన మెళకువలు.!
ఇంకో నాలుగు ఎకరాల పొలంలో టైవాన్ జామకాయ సాగు చేస్తున్నారు. దానితో పాటు పొలం కంచె వెంట డ్రాగన్ పండ్లు సాగు చేయడం ద్వారా అధిక లాభం వస్తుంది. ఒక కిలో డ్రాగన్ పండ్లు 70 నుంచి 150 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ పండ్లు, కూరగాయల్ని అమ్మడానికి వెళ్లిన సమయంలో అని ఒకటే దగర దొరకడం వల్ల వ్యాపారులు, సామాన్యులు ఒకటే స్థలంలో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. దాని వల్ల రైతులకి వాళ్ళు పండించిన పంట తొందరగా అమ్ముకుంటున్నారు. దానితో పాటు మంచి లాభాలు కూడా వస్తున్నాయి.
ఈ జామ పండ్లు సంవత్సరం మొత్తం ఉండటంతో వీటి నుంచి అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఈ జామ పండ్లు ఒక కిలో 50 నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా అని ఒకటే దగ్గర సాగు చేయడం ద్వారా రైతులకి పెట్టుబడి తగ్గి, ఆదాయం పెరుగుతుంది.
Also Read: కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం.!