Vegetable Cultivation: విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఈ రబీ పంటకాలంలో టమాట, వంగ, మిరప, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలీ మరియు బంతి పంటలను ఎక్కువగా సాగుచేస్తునారు కానీ రైతులు ఆరోగ్యవంతమైన నారు పొందలేక పోవడం మరియు అధిక దిగుబడులు నిచ్చే రకాలను ఎంచుకోవడం పోవడం ద్వారా రైతులు కూరగాయలు సాగులో అధిక దిగుబడులను సాధించలేక పోతున్నారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కృషి విజ్ఞాన కేంద్రం, కొండెపూడి శాస్త్రవేత్త డాక్టర్.N.సత్తిబాబు (ఉద్యాన విభాగం) వారు నూతన పద్ధతిమైన ప్రోట్రేష్ పద్ధతిలో ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవచ్చును.
ముఖ్యంగా రైతులు కూరగాయల నారును ఎత్తైన నారుమడులలో పెంచుకోవడం ద్వారా ఆ కాలంలో పడే వర్షాలు ఎక్కువగా ఉండటం ద్వారా నారుమడులలో నారు కుళ్ళు తెగులు అదించి 2 -3 రోజులలో నారు మొత్తం చనిపోతుంది. దీని ద్వారా రైతులకు ఎక్కువగా నష్టం జరుగుతుంది మరియు కూరగాయల నారు విత్తనాలు ఎకరానికి 2000 – 3000 /- ఖర్చు అవుతుంది. కాబట్టి రైతులు ఈ సమస్యను అధిగమించలంటే ప్రోట్రేష్ పద్ధతిని మరియు అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకోవాలి.
Also Read: మిద్దెతోటని ఎలా మొదలు పెడితే బాగుంటుంది
ప్రోట్రేష్ మీడియా తయారీ చేయు విధానం:
వర్మికంపోస్ట్ రెండు భాగాలు మరియు ఒక భాగం కొబ్బరి పొట్టును ప్రోట్రేష్ నింపుకోవాలి. ఈ మీడియాలో ముందుగా 100 కిలోల వర్మీకంపోస్టు,50 కిలోల కొబ్బరి పొట్టులో 2 కిలోలు ట్రైకోడెర్మా విరిడి పొడిని కలపడం ద్వారా నారుకుళ్ళు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ ప్రోట్రేష్ టమాట, మిరప, వంగ, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలీ మరియు బంతి నారును ఆరోగ్యవంతంగా 30 – 35 రోజులు పెంచి అక్టోబరు – నవంబర్ నెలల్లో ప్రధాన క్షేత్రాలల్లో టమాట, వంగ మరియు మిరపను వరసల మధ్య దూరం 60 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య దూరం 60 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ నారును వరసల మధ్య దూరం 45 సెం.మీ. మరియు మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెం.మీ. దూరాలతో నాటుకోవాలి.
రకాల ఎంపిక : టమాటలో తెగుళ్ళను తట్టుకొనే రకాలైన అర్క అభీట్ మరియు అర్క సామ్రాట్ రకాలను ఎంచుకోవాలి అలానే వంగలో వి.న.ర్ – 51 , అర్క ఆనంద్ రకాలను మరియు మిరపలో కాయకుళ్ళు తెగుళ్ళను తట్టుకొనే LCA – 625 మరియు LCA -620 రకాలను బంతిలో పసుపురంగు పూలైన ఎల్లో బిగ్ బాల్, ఎల్లోడాలర్, ఎల్లో మాక్సిమా అలానే ఆరంజ్ రకాలైన USA ఆరంజ్ రకాలను సాగుచేయడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చును.
Also Read: కొబ్బరి పీచుతో ఇంట్లోనే కూరగాయలు పండించండిలా!