Capsicum Cultivation: భారత్లో కూరగాయలు 9.21 మి. హై సాగవుతూ 16,219 మి.ట. దిగు బడితో ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. దిగు బడుల్లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో (11.6 ట/హె.) మన దేశం వెనకబడి ఉంది.
తెలంగాణలో ఉన్న భూవాతావరణ పరిస్థితులు చాలా రకాల కూరగాయ పంటలను ఆరుబయట పొలాల్లో పండించడానికి అనువైనవే. అధిక పరిమా ణంలో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికొచ్చే ప్రథమ శ్రేణి ఉత్ప త్తులకు అనుకూలం కాదు. ఆరుబయట పొలాల్లో సాగుచేసే పంటల్లో ప్రతి కూల వాతావరణ పరిస్థితులు, వివిధ రకాల చీడపీడలు, వాటి నివారణకు వాడే క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడకం, కూరగాయ పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను దెబ్బతీస్తు 1 న్నాయి. వాటన్నింటిని అధిగమించి, కూరగాయల సాగులో అధిక దిగుబడితో పాటు ఎగుమతికి అనువైన నాణ్యమైన దిగుబడులను సాధించాలంటే మౌళిక వసతులు, సాగు పద్ధతులు, పరిజ్ఞానం ఎంతైనా అవసరం.
హరితగృహాల్లో కూరగాయల సాగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆధునిక విధానాల్గో కూరగాయల సాగుకు రాష్ట్ర ఉద్యానశాఖ పలురాయితీలతో పాటు రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అనువైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిస్తోంది. వీటి ప్రభావంతో చాలా మంది రైతులు మార్కెట్కి అను వైన నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు.
బెంగుళూరు మిరప లేదా కూరమిరప : కాప్సికంను సిమ్లా మిర్చి, స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్ లేదా గ్రీన్ పెప్పర్ అని కూడా అంటారు..ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి అధికంగా ఉంటాయి. 100 గ్రా. కాప్పికంలో కాల్షియం- 13.4 మి.గ్రా., మెగ్నీషియం-14.9 మి.గ్రా., భాస్వరం-28.3 మి.గ్రా., పొటాషియం-263.7 మి.గ్రా. ఉంటాయి. హరితగృహాల్లో సాగుచేయడానికి కాప్సికం అనువైన పంట. హరితగృహాల్లో కాప్సికంను సాగుచేసి ఆకర్షణీయమైన రంగు, నిర్దిష్టమైన ఆకారం, గరిష్ఠ పరిమాణంలో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
Also Read: Safata Capsicum: వేసవి సీజన్‌లో క్యాప్సికం సాగు ద్వారా మంచి ఆదాయం
వాతావరణం: కంకు చల్లగా, పొడిగా ఉండే వాతా వరణం అనుకూలం. పగలు 26-28 డిసెం.గ్రే. రాత్రి 16-18 డి.సెం.గ్రే ఉష్ణోగ్రతలు అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో మొక్కలు ఏపుగా పెరిగినప్పటికీ పిందె కట్టడం గణనీయంగా తగ్గి పోతుంది.
రకాల ఎంపిక: సంకరజాతి కూరమిరప ఆకు పచ్చ, ఎరుపు, నారింజ లేదా పసుపు రంగు కాయలు కాస్తాయి. ఈ రకాల కాయలు నాలుగు ముఖాలు కలిగి, 150 .గ్రా బరువుతో, పరిపూర్ణమైన ఆకర్షణీయ మైన రంగు కలిగి, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
ఇంద్ర: ఈ రకం మొక్కలు ఎత్తుగా, గుబురుగా, ఏపుగా పెరుగుతాయి. ఆకులు ముదురాకు పచ్చగా, దట్టంగా ఉండి, ఎదిగే కాయకు రక్షణ నిస్తాయి. కాయలు ముదురాకుపచ్చ రంగులో ఉండి ఆకర్షణీయమైన మందపాటి తోలుతో 10-12 సెం.మీ. పొడవు, 10 సెం. మీ. చుట్టుకొలత, 170 గ్రా. బరువు 3-4 ముఖాలు కలిగి ఉంటాయి. నాటిన 50-55 రోజుల్లో పిందె పట్టడం మొదలవుతుంది. కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండి దూర ప్రాంతాలకు, ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
బోంబి: మొక్కలు ఎత్తుగా నిటారుగా ఎక్కువ కొమ్మలను కలిగి త్వరగా కాపుకొస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు ముదురాకుపచ్చ రంగులో ఉండి ఆ తర్వాత ఆకర్షణీయమైన ఎరుపురంగు, మందపాటి తోలుతో 10-11 సెం. మీ. పొడవు, 10 సెం.మీ. చుట్టుకొలత, 130-150 గ్రా. బరువు, 3-4 ముఖాలు కలిగి ఉంటాయి.
ఓరోబెల్లి: ఇది చల్లని వాతావరణంలో అధిక దిగు బడినిస్తుంది. కాయలు చతు మందంగల పసుపు తోలుతో 150 గ్రా. ఉంటాయి. రంగు బరువుతో
స్వర్ణ: మొక్కలు దృఢంగా, ఏపుగా పెరుగుతాయి. కాయలు పొడవుగా, మంద మైన పసుపు పచ్చ తోలుతో 200- 250 గ్రా. వరకు బరువు కలిగి ఉంటాయి.
నారు పెంపకం: హరిత గృహాల్లో 160-200 గ్రా. విత్తనాలతో ప్లగ్ లలో పెంచిన 16,000 20,000 నారు మొక్కలు ఒక ఎకరం పొలంలో నాటేందుకు సరిపోతాయి. నారు పోసిన 15 రోజుల తర్వాత మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ (12:61:0 3 గ్రా./లీ.. 22 రోజుల తర్వాత 19:19:19 3 గ్రా./లీ. ను మొక్కల మొదలు దగ్గర పోయాలి. నారును ప్రధాన పొలంలో నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ 0. 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: కాప్సికం పంట సాగు చేసే పద్ధతులు…
Also Watch: