Litchi Management: భారతదేశంలో 92 వేల హెక్టార్లలో లిచ్చి సాగు చేయబడుతోంది. ఇది మొత్తం 686 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది. కాగా.. బీహార్‌లో 32 వేల హెక్టార్లలో లిచీ సాగు చేయబడుతోంది. ఇది 300 మెట్రిక్ టన్నుల లిచ్చి పండ్లను ఇస్తుంది. బీహార్‌లో లిచీ ఉత్పాదకత హెక్టారుకు 8 టన్నులు కాగా జాతీయ ఉత్పాదకత హెక్టారుకు 7.4 టన్నులుగా ఉంది. మొత్తం లిచీ ఉత్పత్తిలో బీహార్ వాటా 80 శాతం. ఇకపోతే జనవరి నెల ముగియడంతో లిచీ ఉత్పత్తి చేసే రైతులు ఫిబ్రవరి నెలలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయాలను చూద్దాం..
లిచీ తోటలో పురుగు సోకిన కొమ్మలను కోసి ఒకే చోట సేకరించి కాల్చివేయాలి. లిచీ తోటలో మంచి ఫలాలు, ఉత్తమ నాణ్యత కోసం ఆశించిన సమయానికి కనీసం మూడు నెలల ముందు లిచీ తోటకు నీరు పెట్టకూడదు. మరీ ముఖ్యంగా తోటలో అంతర పంటలు వేయకూడదు. లీటరులో 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి. పుష్పించే సమయంలో చెట్టుపై ఎలాంటి పురుగు మందులను పిచికారీ చేయకూడదు.
Also Read: చలికాలంలో రబీ పంటల సంరక్షణ
పుష్పించే సమయంలో లిచీ తోటలో హెక్టారుకు 15 నుండి 20 తేనెటీగ పెట్టెలను ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పరాగసంపర్కం బాగా జరుగుతుంది. దీని కారణంగా పండ్ల నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో అదనపు ఆదాయం వస్తుంది. పండ్లు కాసిన ఒక వారం తర్వాత ప్లానోఫిక్స్ 1 మి.లీ. లీటరుకు 3 లీటర్ల చొప్పున మందును నీటిలో కరిగించి పిచికారీ చేయడం ద్వారా పండ్లు రాలకుండా నిరోధించవచ్చు. పండిన 15 రోజుల తరువాత లీటరు నీటికి 5 గ్రాముల బోరాక్స్ ద్రావణాన్ని తయారు చేసి 15 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు పిచికారీలు చేయడం వలన పండ్లు రాలడం తగ్గుతుంది. ఈ విధానం ద్వారా పండు తీపి మరియు పరిమాణం మరియు రంగు పెరుగుతుంది. పండ్లు పగిలిపోయే సమస్య కూడా తగ్గుతుంది.
Also Read: పొగాకు పంటలో నర్సరీ యాజమాన్యం