telangana civil supply paddy procurement Issue ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చినప్పటికీ రైతన్నలకు తిప్పలు తప్పేలా లేదు. పంట కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కుప్పలుగా పేరుకుపోతున్నది. చేతికొచ్చిన ధాన్యం ఎండకు ఎండి , వానకు తడిసి ఖరాబ్ అవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా పంటను కొనుగోలు చేయకపోవడంతో ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. ధాన్యం కొనుగోళ్లపై ముందు అనుకున్న టార్గెట్ ని తగ్గించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
మొదట కోటి 3 లక్షల టన్నుల పంట కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం 31.94 లక్షల టన్నుల పంటని మాత్రమే సేకరించింది. అంటే 32 శాతానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అనేక ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ కాంటా పెడ్తలేరని అంటున్నారు రైతులు. దీంతో రైతులు తమ పంటను కాపాడుకునేందుకు కుటుంబంతో కలిసి ధాన్యం వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. telangana civil supply
మరోవైపు వానాకాలం పంట కొనుగోలుపై 18 శాతానికి తగ్గించి సేకరణ చేపడతామని సివిల్ సప్లయ్స్ అధికారులు చెప్తున్నారు. యాసంగి పంట వివాదం కారణంగా మొదట పెట్టుకున్న టార్గెట్ లో 18.96 లక్షల టన్నుల ధాన్యాన్ని తగ్గించి 84. 14 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. దీంతో రైతులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. వానాకాలం పంట సేకరణలో ఎటువంటి సమస్యలు ఉండవంటూ చెప్పుకొచ్చిన సర్కారు , ఇప్పుడు మాట మార్చి తగ్గించి కొనుగోలు చేస్తామని చెప్తుండటంతో రైతులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక బార్డర్ లో ఉన్న రైతులు వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకుంటున్నారు. దీంతో సంబంధిత శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖమ్మం (Khammam)జిల్లాలో 249 సెంటర్లు ఓపెన్ చేసినా.. 21 సెంటర్లలోనే వడ్లు కొంటున్నరు. కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో 166 సెంటర్లకు గాను 2 సెంటర్లలో, వరంగల్ (Warangala) జిల్లాలో 161 సెంటర్లకుగాను 40 సెంటర్లలో, మహబూబాబాద్ జిల్లాలో 202 సెంటర్లకుగాను 19 సెంటర్లలో, మంచిర్యాల జిల్లాలో 230 సెంటర్లకుగాను 53 సెంటర్లలో, వికారాబాద్ జిల్లాలో 127 సెంటర్లకు గాను 42 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
TS Paddy Procurement Issue, Telangana Civil Supplies, Telangana Farmers, Paddy Procurement Centres