Fish Farming Techniques: ప్రస్తుత కాలంలో వర్షాలు విరివిగ పడుతున్నాయి కాబట్టి రైతులు ప్రధాన చెరువును సిద్దం చేసుకొని, ఆలాగే చేప పిల్లల పెంచే చెరువును కూడా సిద్దం చేసుకొని, మంచి నాణ్యమైన చేప పిల్లల వృద్ది చేసుకొని చేపల పెంపకంలో మంచి దిగుబడి పొందవచ్చును. చేప జాతి పిల్లలు, కావలసిన సమయంలో, కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో ఒక కీలకాంశం. గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్ చేపల నర్సరీ విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత ఉంది. చేప గుడ్లు పొదిగి, పిల్లలు కేవలం 72-96 గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవడానికి అలవాటుపడే, (స్పాన్) దశనుంచి, 15-20 రోజుల వయసు వచ్చేంత వరకు అంటే 25-30 మి.మీ.సైజు వచ్చే వరకు (ఫ్రై దశ) నర్సరీలలో పెంచుతారు. ఆ తర్వాత ఈ ఫ్రైలను, దాదాపు 100 మి.మీ. సైజుకు (ఫింగర్‌లింగ్స్ దశ) ఎదిగేంత వరకు మరో చెరువులో పెంచుతారు.
చెరువుల రకాలు :
మంచి నీటి చేప క్షేత్రంలో ఉండే చెరువులు 3 రకాలు, పెంచే దశను బట్టి వీటిని నర్సరీ, రేరింగ్ పాండ్, స్టాకింగ్ (గ్రో అవుట్) పాండ్‌గా పిలుస్తారు.
ప్రీ స్టాకింగ్ యాజమాన్య పద్ధతి :
దీనిలో చేప పిల్లల పెంపకం జూన్ నెల నుండి సెప్టెంబర్, అక్టోబర్ నెల వరకు సాగుతుంది. దీని యందు చెరువు తయారీ అతి ముఖ్యమైనది. చెరువు తయారీ నందు చెరువు ఎండబెట్టడం, దున్నడం, సున్నం చల్లడం, నీరు పెట్టడం, ఎరువులు వాడడం అనే దశలుంటాయి.
కలుపు మొక్కలు / నీటి మొక్కలు తొలగించుట :
వీటిని మనుషులు లేక యాంత్రిక లేక రసాయన పద్ధతుల (గ్లైకో ఫాస్ఫేట్ 3 కిలో/హెక్టారుకు) ద్వారా నివారించుకోవాలి, గడ్డి చేపలను హెక్టారుకి (100-200) పెంచుట ద్వారా చాలా రకాల్కెన కలుపు మొక్కలను జీవపరంగా నివారించవచ్చును.
నర్సరీ కుంటలను ఎండబెట్టడం :
అడుగు భాగం బాగా బీటలు వారునట్లు ఎండబెట్టాలి. ఫలితంగా వ్యాధికారక క్రిములు, పరాన్న జీవుల వివిధ దశలు నశిస్తాయి. మట్టి కుంటల అడుగు భాగమును బాగా దున్నించాలి ఫలితంగా భూమిలో విష వాయువులు గాలిలో కలిసిపోతాయి. భూమిలో నత్రజని స్థిరీకరించబడుతుంది. ఫలితంగా నేల సారం పెరిగి సహజ ఆహరం/ ప్లవకాలు వృద్ధికి దోహదపడుతుంది.
సున్నం వాడకం :
సున్నం వాడకం వలన నేలలో నిక్షిప్తమై యున్న పోషకాలు విడుదలవుతాయి. కుంట నేలలో ఉన్న వ్యాధి కారక క్రిములు నశిస్తాయి. నేల పి.హెచ్ ని సమస్థితిలో ఉంచుతుంది. సున్నంనుండి స్పాను పెరుగుదలకు అవసరమైన కాల్షియం అందుతుంది.సాధారణ పరిస్థితులలో ప్రతినెల హెక్టారుకు 250 కిలోల సున్నం చల్లడం అన్ని విధాలా మంచిది.
నీరు పెట్టుట :
నర్సరీలకు నీరు పెట్టునప్పుడు 80,100 మైక్రాన్ మెష్ గల రెండు పొరల సంచులలో వడకట్టి పెట్టాలి. నర్సరీ కుంటలతో మొదట నీరు 2 అడుగుల మేర పెట్టాలి.
మెన్యూరింగ్ :
స్టాకింగ్ మూడు రోజుల ముందు మెన్యూరింగ్ చేసుకోవాలి. హెక్టారునకు 1000`2500 కిలోల పశువుల పేడను వివిధ దఫాలలో వాడాలి. సాధారణంగా సేంద్రియ ఎరువుల్కెన పేడ, కోడి పెంట, రసాయనిక ఎరువుల్కెన సూపర్ ఫాస్పేట్ / యూరియా వాడాలి.
Also Read: గో ఆధారిత ద్రవాలతో అంతర పంటల సాగు.!
ఎరువు రకము మోతాదు (ఎకరంనకు)
పేడ 600-800 కేజీలు
కోళ్ల పెంట 500-600 కేజీలు
వేరుశెనగ చెక్క 30-45 కేజీలు
సింగిల్ సూపర్ ఫాస్పేట్ / యూరియా 30-40 కేజీలు
దీని వలన చేప పిల్లలకు కావలసిన సహజ ఆహారం (ప్లాంక్జాన్) ఉత్పత్కెన నీటి రంగు గోధుమ రంగులోకి గాని, ఆకుపచ్చ రంగులోని గాని మారుతుంది.
స్టాకింగ్ యజమాన్య పద్ధతి :
స్పాను స్టాకు చేయునప్పుడు నర్సరీ లోతు (2 అడుగులు ) తక్కువగా ఉండాలి.
. 5-8 మి. మీ సైజు గల స్పాను ను ఎకరానికి 20-50 లక్షల వరకు వదులుకోవచ్చును.
. ఒకే రకము / జాతికి చెందిన స్పానును మాత్రమే ఒక నర్సరీలో వేసి పెంచాలి.
స్పాను స్టాకు చేయు సమయం :
స్పానుని చల్లని వేళలో ఉదయం గాని, సాయంకాలం గాని స్టాకు చేయాలి. మబ్బులు ఉన్నపుడు, ఎండగా ఉన్నప్పుడు స్టాక్ చేయరాదు.
స్పాను స్టాక్ చేయు విధానము :
. నర్సరీ నీటికి అలవాటు చేయుట (ఎక్లిమట్కెజేషన్)
. స్పాను గల పాలిథీన్ బ్యాగులను నర్సరీ నీటిపై ఒక అరగంట ఉంచిన నర్సరీ నీటి ఉష్ణోగ్రత స్పాను గల బ్యాగు నీటి ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది.
. స్పాను బ్యాగులను తెరచి నర్సరీ నీటిని కొద్ది కొద్దిగా స్పాను బ్యాగుకు కలిపిన పిదప క్రమంగా స్పాను బ్యాగు నీటి నుండి స్పాను నర్సరీ నీటిలోకి ప్రవేశిస్తుంది.
పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య పద్ధతి :
అదనపు ఆహారం : ప్లవకాల సాంద్రత ను బట్టి స్పాను స్టాక్ చేసిన 2 లేదా 3 వ రోజు నుండి అదనపు ఆహారంగా వేరుశెనగ చెక్క, పచ్చి తవుడు 1:1 నిష్పత్తి లో నర్సరీ నీటిపై చల్లాలి.
మేత ప్రణాళిక :
మొదటి వారం శరీర బరువుకు సమానంగాను, రెండవ వారం మొదటి వారంకు రెట్టింపు మేత మరియు మూడవ వారం రెండవ వారం కు రెట్టింపు ఇవ్వాలి. మేతను రెండు సమ భాగాలుగా చేసి రోజులో రెండు దఫాలుగా ఇవ్వాలి. ప్రతి రోజు మేతను ఒక నిర్దిష్ట సమయంలో ఇవ్వాలి. 8వ రోజు నుండి 21 లేదా 28 రోజు వరకు మేతను పొడి రూపంలో వేరుశెనగ చెక్క, తవుడు ఇవ్వాలి. మబ్బులుగా ఉన్నప్పుడు, చిరుజల్లులు పడుతున్నప్పుడు మేతలు ఆపేయాలి.
నర్సరీ నీటి యాజమాన్యంలో రైతులు తీసుకొనవలసిన జాగ్రత్తలు :
. నర్సరీ నీరు లేత ఆకుపచ్చగా ఉండే విధంగా ఎరువులు వాడాలి.
. నీరు ముదురు ఆకుపచ్చగా ఉంటే నీటి మార్పిడి చేయాలి.
. ప్రతి రోజు నర్సరీ కి క్రొత్త నీరు పెట్టడం అన్ని విధాలా మంచిది.
. మేతలను తగిన పరిణామం లో వాడుకోవాలి. నీటి పి. హెచ్ మార్పులు అధికంగా ఉంటే నీటి మార్పిడి చేయాలి. నర్సరీ నీటి పారదర్శకతను సెచ్చి డిస్క్‌లో ప్రతి 5 లేదా 6 రోజులకు ఒకసారి పరిశీలించాలి. దీని రీడిరగ్ 25-35 సెం.మీ ఉండాలి.
నమూనా సేకరణ ఆరోగ్య పరీక్షలు :
క్రమం తప్పకుండా నర్సరీ నుండి చేప పిల్లలను సేకరించి ఆరోగ్య పరిశీలన చేయాలి. చేప పిల్లల శరీరం పొలుసులు, రెక్కలు పరిశీలించాలి.
చేప పిల్లల సాంద్రత పరిశీలన : స్పాను స్టాక్ చేసిన 12-15 వ రోజున లాగుడు వలతో పట్టి సాంద్రత పరిశీలించి బ్రతుకుదల అంచనా వేసుకోవాలి.
Also Read: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి – మంత్రి