మొక్కజొన్న ముఖ్యంగా రబీ కాలంలో సాగు చేస్తారు. అంతేకాకుండా ఇది ముఖ్యమైనటువంటి రబీ పంట. రబీలో సాగు చేయడంవల్ల దీని కోత కాలం వేసవిలో వస్తుంది. వేసవిలో రావడం వల్ల, అధిక ఉష్ణోగ్రత వల్ల కూలీల కొరత అధికంగా ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న గింజను ఏకకాలంలో తీయడం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల ఈ కింద చెప్పిన పరికరాల ద్వారా మొక్కజొన్న గింజలను తక్కువ కూలీతో, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో తీయవచ్చు.
మొక్కజొన్న కండె నుండి గింజలను వేరు చేసే యంత్రాన్ని మొక్కజొన్న తీసే యంత్రం అంటారు. ఇందులో రెండు రకాల యంత్రాలున్నాయి.
1. చేతితో తిప్పే యంత్రం
2. యంత్ర సహాయంతో పనిచేసే యంత్రం
చేతితో తిప్పే యంత్రం :
ఇది 15 సెం. మీ పొడవు ఉండి, మందపాటి ఇనుప రేకుతో తయారుచేసిన గొట్టం. దీని ముఖద్వారం వద్ద వ్యాసమెక్కువగా ఉండి పోను పోను తక్కువగా ఉంటుంది. వీటి లోపల 3 లేక 43 రెక్కలు బిగించి ఉండి అర వలె ఉంటాయి. ఈ పరికరాన్ని ఒక చేతితో పట్టుకుని మరొక చేతితో మొక్కజొన్న కండెలను దీని ముఖద్వారం వద్ద ఉంచి గుండ్రంగా తిప్పాలి. అలా తిప్పేప్పుడు గింజకు, రెక్కకు మధ్య రాపిడి వల్ల గింజలు వేరవుతాయి. దీని ద్వారా రోజుకు 40-50 కిలోల గింజలను వేరు చేయవచ్చు. ఈ పరికరాన్ని ఉపయోగించి ఒక మనిషిచేత ఒక రోజులో అరచేతిపై ఎటువంటి భారం పడకుండా రోజుకు 1000-1200 కిలోల గింజలను వేరు చేయవచ్చు.
యంత్ర సహాయంతో పని చేసే యంత్రం :
ఈ యంత్రంలో భాగాలు అన్ని ఇనుప చట్రంలో అమర్చబడి ఉంటాయి. దీనిలో ఉపయోగించే సిలిండర్ ఉపరి త భాగాన చిన్న చిన్న ముళ్ళ వంటి పళ్ళు ఉంటాయి. మోటర్ నుండి సిలిండర్‌కు బోల్టు సహాయంతో యంత్రశక్తి లభిస్తుంది.
మొక్కజొన్న కండెలను వేగంగా తిరుగుతున్న సిలిండర్ పై పడి, సిలిండర్ కాంకేవ్‌ల మధ్య ఒత్తబడుతుంది. మొక్కజొన్న కండెల మధ్య కలిగే రాపిడి మూలాన గింజలు కండె నుండి వేరు చేయబడతాయి. ఆ విధంగా పడునప్పుడు పక్కగా అమర్చమడిన బ్లోయర్ ద్వారా వీచే గాలి ద్వారా పొట్టు, గింజలు లేని కండెను బయటకు నెట్టబడును. ఈ విధంగా మంచి గింజలు ఒక వైపు నుండి తరువాత మిగిలిన గింజలు వేరొకవైపు నుండి వేరు చేస్తారు. దీన్ని ఉపయోగించి గంటకు 3వేల కిలోల వరకు మొక్కజొన్నను ఒలవవచ్చు.