వార్తలు

Turmeric Cultivation: పసుపు పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

1
turmeric powder
Turmeric Price
Turmeric Cultivation: మన భారతదేశంలో పసుపును ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 50 శాతం వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే పండిస్తున్నారు. పసుపులో రకాలను బట్టి (210 నుండి 270) రోజుల మధ్య దుంపలను, కొమ్ములను భూమిలో నుంచి వివిధ పద్ధతుల ద్వారా తీస్తున్నారు. ప్రస్తుతం రైతులు పసుపు పంటలో దుంప కోత, తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
Turmeric

Turmeric

తవ్వడం:
పసుపును భూమిలో నుంచి వివిధ పద్ధతుల (సాంప్రదాయక తవ్వడం, ట్రాక్టర్‌తో మరియు పవర్‌ టిల్లర్‌) ద్వారా తీస్తున్నారు. పసుపును తవ్వే ముందు ఆకులను కాడలను భూమట్టానికి కోసి వేసి కాల్చి వేయాలి. నీరును పసుపు పంటకు ఇచ్చిన తరువాత దున్ని దుంపలను భూమిలో నుంచి చేయాలి.
ఉడకబెట్టడం: 
తవ్విన దుంపలను రెండు నుండి మూడు రోజుల లోపల ఉడకబెట్టాలి. తల్లి దుంపలను మరియు పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. ఇనుప కడాయి లేదా రాగి పాత్రలో దుంపలు మునిగేంత వరకు నీరు పోసి 45 నుండి 60 నిమిషాల వరకూ ఉడకబెట్టాలి.
ఆరబెట్టడం: 
మంచిగా ఉడికిన పసుపు దుంపలను తీసి టార్పాలిన్‌ మీద లేదా శుభ్రమైన నేల మీద పోసి ఆరబెట్టాలి. ఆరబోసిన పసుపును పది నుండి పదిహేను రోజుల మధ్యలో అప్పుడప్పుడు పసుపును పైకి కిందకి కలియదిప్పాలి. దుంపలను కృత్రిమంగా 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిగాలి పంపి కూడా ఆరపెట్టవచ్చును. పసుపును ఆరబెట్టేటప్పుడు మంచుతో లేదా వర్షంలో గాని తడవకుండా జాగ్రత్త పడాలి. వర్షంలో తడవడం వలన పసుపుకు బూజు తెగులు ఆశించి అప్లాటాక్సిన్‌ అనే విష పదార్థం అభివృద్ధి చెందుతుంది.

Also Read: ఒక ఎకరంలో 65 క్వింటాళ్ల పసుపు సాగు చేసిన రైతు

పాలిషింగ్‌:
వివిధ పద్ధతుల ద్వారా పాలిషింగ్‌ చేయడం వలన నాణ్యతగా ఉండి మార్కెట్లో మంచి ధరపలికి రైతులకు లాభం కలుగును. దుంపలను గోనెసంచిలో పోసి గట్టిగా నేలపై రుద్దడం ద్వారా గాని లేదా కాళ్లతో రాకడం ద్వారా కూడా పాలిష్‌ చేయవచ్చును. ఇనుప  జాలి కలిగిన డ్రమ్ములు లేదా యంత్రాలతో పసుపు కొమ్ములను వేసి తిప్పడం వల్ల కూడా పొలుసులు, వేర్లు  ఊడిపోయిన దుంపలకు పాలిష్‌ వస్తుంది.
గ్రేడింగ్:
పాలిషింగ్‌ అయిన దుంపలను కొత్త గోనె సంచులలో పోసి జాగ్రత్త పరచుకోవాలి.
పసుపు కొమ్ములను నిల్వ చేయుట: 
మంచి కొమ్ములను విత్తనం కోసం నిల్వచేసుకోవాలి. విత్తన పసుపు దుంపలను మంచి గుంతలను లేదా చెట్టు నీడన చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఈ దుంపలపై వేప ఆకు గాని,  వరిగడ్డిని కానీ కప్పాలి. విత్తిన దుంపలను రంపపు పొట్టులో కప్పి కూడా నిల్వ చేసుకోవచ్చు. పైన చెప్పిన విధంగా అన్ని పద్ధతులను రైతులు పాటించినట్లైతే మంచి నాణ్యత, కర్క్యుమిన్‌, ఓలియోరెసిన్‌, నూనె శాతం అధిక దిగుబడిని పొందవచ్చు. ఈ విధంగా నిల్వ చేసుకున్న ఒక కిలో దుంపలను వర్షాలు పడిన తరువాత వీటన్నిటికీ మూడు గ్రాముల రిడోమిల్‌ యం. జెడ్‌ మరియు రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్‌ మందులను కలిపి విత్తుకున్నట్లయితే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చును.
డా. ఎ. వియజభాస్కర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, కరీంనగర్‌, ఫోన్‌ : 98498 17896
Leave Your Comments

Mango Fruit Covers: మామిడపండ్లకు ‘‘కవర్స్‌’’ వాడడం`ఉపయోగాలు

Previous article

Bt Cotton: రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బిటి పత్తి సాగు

Next article

You may also like