ఆరోగ్యం / జీవన విధానం

Wheat Rava Idli Recipe: బరువు తగ్గడానికి సహాయపడే గోధుమరవ్వ ఇడ్లినీ అరగంటలో తయారు చేసేద్దామా .!

2
Wheat Rava Idli
Wheat Rava Idli

Wheat Rava Idli Recipe: గోధుమరవ్వ లో పీచు పదార్ధం పుష్కలంగా లభిస్తుంది. దీనిలో ఖనిజాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఉత్తమమైన ఆహరం.

రెసిపీ వంటకాలు: సౌత్ ఇండియన్ రెసిపీ
మొత్తం సమయం (నిమిషాలు): 30
సర్వింగ్స్: 2

కావలసినవి:
గోధుమ రవ్వ – 1 కప్పు
పెరుగు – అర కప్పు
తురిమిన క్యారెట్ – 1 టేబుల్ స్పూన్
కొన్ని తరిగిన కరివేపాకు
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ENO ఉప్పు – 1 చెంచా
రుచికి తగినంత ఉప్పు
నీరు

Wheat Rava Idli Recipe

Wheat Rava Idli Recipe

తయారీ విధానం:
1 కప్పు గోధుమ రవ్వకు అరకప్పు పెరుగు, పావు వంతు 1/4 నీరు తీసుకుని ఉప్పును బాగా కలపాలి (సాధారణ ఇడ్లీ పిండి మిశ్రమం వలె). బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత తురిమిన క్యారెట్, కరివేపాకు వేసి వేయించాలి. ఈ మసాలా దినుసులను పిండి మిశ్రమంలో కలపాలి.

ఇడ్లీ కుక్కర్‌ని నీటితో వేడి చేసి మరిగించాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌లను నూనెతో గ్రీజు చేసి, గోధుమ రవ్వ పిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకోవాలి. వేడినీటిలో ఉంచి మూత మూసివేసి 15 నిమిషాలు ఆవిరిలో ఉంచాలి. ఆవిరి పోయిన తరువాత ఇడ్లీలను తీసి బయట పెట్టాలి. వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ/సాంబార్‌తో వేడిగా వడ్డించుకుని తినేయచ్చు. ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆహారాన్ని తరుచుగా తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Also Read: Rajasthani Churma Laddu: గోధుమ పిండితో చేసే చుర్మా లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా? అయితే తయారీ విధానం మీ కోసం

Also Read: Honey Adulteration Test: తేనెలో కల్తీని గుర్తించడం ఎలా..?

Leave Your Comments

Telangana Government: పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గిరిజన రైతులకు వరాలు!

Previous article

Tomato Price: కిలో టమాట 50 రూపాయలకే .. 103 మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

Next article

You may also like