ఆరోగ్యం / జీవన విధానం

Prevent Cut Apples From Turning Brown: యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి.!

0
How to Prevent Cut Apples From Turning Brown
How to Prevent Cut Apples From Turning Brown

Prevent Cut Apples From Turning Brown: యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి. లేదంటే యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్‌ కలర్‌లోకి మారుస్తుంది. సాధారణంగా మనమేదైనా పండుని కట్‌ చేశాక లేదంటే ఒలిచాక ఆ మొత్తం పండుని ఒక్కసారిగా తినలేకపోతే. మిగిలిన ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వచేసుకొని తర్వాత తింటుంటాం.

ఎందుకంటే ఫ్రిజ్‌లో అవి కొన్ని గంటల వరకు తాజాగా ఉంటాయి కాబట్టి కానీ  యాపిల్‌ విషయంలో మాత్రం ఇది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి. కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలను ఐస్‌ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీయాలి.

ఇలా చేయడం వల్ల యాపిల్‌ ముక్కలు కాసేపటి వరకు తాజాగా ఉంటాయి. లేదా  కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో బంధించాలి . యాపిల్‌ని ముక్కలుగా కట్‌ చేసిన తర్వాత వెంటనే వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టి అందులో గాలి తగలకుండా పెట్టాలి .ఆ బ్యాగ్‌ను అలాగే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. తద్వారా యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరపదు. ఫలితంగా యాపిల్‌ ముక్కలు ఎర్రబడకుండా జాగ్రత్తపడచ్చు.

ఒక కప్పు మంచి నీళ్లలో, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి కలపండి. ఇప్పుడు ఈ నీటిలో, కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల, యాపిల్‌ ముక్కలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లాలి . నిమ్మరసంలోని సిట్రికామ్లం యాపిల్‌ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడమే కాకుండా వాటిని రంగు మారనివ్వదు.

Also Read:  Apple Farming App: ఆపిల్ సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Prevent Cut Apples From Turning Brown

Prevent Cut Apples From Turning Brown

లేదంటే ఇలా కూడా చేయచ్చు. కప్పు నీటిలో టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో యాపిల్‌ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు నానబెట్టినా చక్కటి ఫలితం ఉంటుంది. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్‌ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందచ్చు.యాపిల్‌ కట్‌ చేయడానికి మనం ఉపయోగించే చాకు కూడా యాపిల్‌ ముక్కల్ని ఎర్రగా మార్చే అవకాశం ఉంటుంది. పాతబడిన, తుప్పు పట్టిన చాకుల్ని యాపిల్‌ కట్‌ చేయడానికి ఉపయోగిస్తే దానిపై ఉండే ఇనుము యాపిల్‌ ముక్కలపై చేరి.. ఆక్సిడేషన్‌ పద్ధతిని మరింత వేగవంతం చేస్తుంది. తద్వారా యాపిల్‌ ముక్కలు అతి త్వరగా బ్రౌన్‌ కలర్‌లోకి మారతాయి. అలా జారకూడదంటే కొత్త చాకుల్ని ఉపయోగించడం శ్రేయస్కరం. 

మరుగుతున్న నీటిలో యాపిల్‌ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉంచి తీయాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. అయితే ఈ క్రమంలో యాపిల్‌ గుజ్జు మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది.. కాబట్టి వంటకాలు, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌లో వాడే యాపిల్స్‌ కోసమైతే ఇలా చేయడం మంచి పద్ధతి.

కొంచెం దాల్చిన చెక్క పొడిని కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై చల్లడం వల్ల ఆ ముక్కలు బ్రౌన్‌ కలర్‌లోకి మారకుండా జాగ్రత్తపడవచ్చు. ఇందుకు దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లే కారణం. అలాగే దాల్చిన చెక్క పొడి వల్ల యాపిల్‌ ముక్కలకు మరింత రుచిగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల  ఆపిల్ రంగు మరే  అవకాశం ఉండదు.

Also Read: Ice Apple: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

Leave Your Comments

Uses of Bio-Fertilizers: జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు.!

Previous article

Worshiping Trees During Dussehra: దసరా సమయంలో పూజించే చెట్ల ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా.!

Next article

You may also like