ఆరోగ్యం / జీవన విధానం

Wax Removal On Apple: ఆపిల్ మీద మైనపు కోటింగ్ గుర్తించండి.

0
Apple
Apple

Wax Removal On Apple: “రోజుకో యాపిల్‌ తినడం వలన డాక్టర్‌ని దూరంగా ఉంచుతుంది అనే సామేత మనం చాలానాటి నుండి వింటూ వస్తున్నాం.  ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వారిని యాపిల్స్ తినమని కావున ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తారు. ఇలా అనేక ప్రయోజనాలతో పాటు అధికంగా తినడం వలన ఆరోగ్య నష్టాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో యాపిల్ చర్మం పైన కృత్రిమంగా ఒక మైనపు పొరను జోడిస్తున్నారని అది మన పెద్దప్రేగు, శ్వాసకోశ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మరియు కొన్ని ఇన్‌ఫెక్షన్‌లకు కూడా దారి తీస్తుందనే వార్త ఆందోళనకు గురిచేస్తుంది.

Wax Removal On Apple

Wax Removal On Apple

అసలు యాపిల్స్‌ పైకి ఈ వ్యాక్స్ ఎలా వస్తుంది ? సాధారణంగా రైతులు లేదా అమ్మె వాళ్ళు యాపిల్స్ పై ఉన్న మురికిని మరియు చెత్తను తొలగించడానికి వాటిని పూర్తిగా కడుగుతారు. ఆ ప్రక్రియలో వాటిపై సహజంగా ఉండే పొర తొలగిపోతుంది. ఆ రక్షణ పొరను తిరిగి పొందడానికి తినడానికి అనుకూలమైన సింథటిక్ మైనపు పొరను వాటి పై వేస్తారు. ఈ పొర వలన పండు చూడటానికి నిగనగలాడుతూ మెరుస్తుంది. నాణ్యతను పెంచుతుంది‌. ఇంకా తేమను పండు నుండి వెలుపలకు రాకుండా చేస్తుంది‌.

Also Read: Sesame seeds: నువ్వుల తో ఆరోగ్యానికి మేలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా వ్యాక్స్ ఉన్న యాపిల్స్ ఏడాది వరకైనా
ఫ్రెష్‌గా తాజాగా కనిపిస్తాయి. FSSAI కొన్ని ఫుడ్ గ్రేడ్ వ్యాక్స్‌లు తినడానికి అనుకూలమని అవి వినియోగించినా సురక్షితమని ఆమోదించింది. కాని మనం తినే యాపిల్స్‌లో పరిమితికి మించి వ్యాక్స్ లు ఉండే ప్రమాదం ఉంది. కనుక మీరు తినేముందు యాపిల్ తొక్కలు బాగా జారే లాగా మైనం ఉన్నట్లు అనిపిస్తే దానిని కడిగి తినడం మేలు. కాని ఇలా చేయడం వల్ల మొత్తం తొలగిపోతుందని నమ్మకం లేదు. కావున మీరు కొనుగోలు చేసిన వెంటనే యాపిల్స్‌ను ఇలా చేయడం వలన మైనపు పొరను తొలగించవచ్చు.

1. యాపిల్స్ ను కొనగానే వేడి నీటిలో ఒక నిమిషం పాటు ఉంచి, ఆపై మైనపు పొరను తొలగించడానికి ఒక టవల్‌తో గట్టిగా తుడవాలి.
2.లేదా నీటిలో కొంత నిమ్మరసం మరియు బేకింగ్ సోడాను వేసి ఆపిల్స్ ని అందులో ఉంచడం వలన వ్యాక్స్ ను తొలగించొచ్చు.
3. చివరగా నీటిలో వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) ను కూడా ఉపయోగించవచ్చు.

Also Read: Panchagavya Preparation and Uses: పరిపూర్ణ వ్యవసాయానికి పంచగవ్య!!

Leave Your Comments

Latest News in Cooking Oil: దిగి రానున్న వంట నూనె ధరలు.!

Previous article

Water Apple Uses: వాటర్ యాపిల్ తినడం వలన వ్యాధులకు చెక్.!

Next article

You may also like