ఆరోగ్యం / జీవన విధానం

Prevention of Malaria: మలేరియా రాకుండా నివారణ చర్యలు!

0
Malaria Prevention
Malaria Prevention

Prevention of Malaria: ప్రపంచంలో ప్రతి ఏటా కేవలం దోమల వల్ల 6 నుండి 8 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు.దోమల వల్ల కలిగే వ్యాధుల్లో ప్రధానమైనది మలేరియా.ఈ మలేరియా వ్యాధి వల్ల ఏటా 5 నుండి 6 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ మలేరియా అనేది ఆడ అనోఫెలిస్ దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. మలేరియా అన్ని వయస్సుల వారిని, అలాగే ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరిని ప్రభావితం చేస్తుంది, అయితే ఎక్కువ బహిరంగ కార్యకలాపాల కారణంగా, మగవారు మలేరియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఈ మలేరియా వ్యాధి వాళ్ళ గర్భిణీ స్త్రీలకు ప్రమాదం ఎక్కువ ఉంది మరియు గర్భధారణ సమయంలో మలేరియా కారణంగా అకాల ప్రసవం లేదా గర్భస్రావం లేదా గర్భాశయాంతర మరణాలు సంభవించవచ్చు.

మలేరియా వ్యాధి అనేది వర్షపాతం, 20 నుంచి 30 సెంటీగ్రేడ్ ల మధ్య ఉష్ణోగ్రత, 60% తేమ, ఇర్రిగేషన్ ఛానల్స్, గార్డెన్ పూల్స్, నిలకడగా ఉండే నీరు వంటి పర్యావరణ కారకాల వల్ల వస్తుంది. మలేరియా ముఖ్యంగా 3 రకాల కారణాల వల్ల వ్యాపిస్తుంది….1. ఆడ అనోఫెలిస్ దోమ కుట్టడం వల్ల 2. మలేరియా వ్యాధి సోకిన రోగికి వేసిన సూదిని ఆరోగ్యాంగా ఉన్న మనిషికి వేస్తే 3. తల్లి నుండి నవజాత శిశువుకి.

Also Read: Papaya Mask for Facial Beauty: ముఖ సౌందర్యం కోసం బొప్పాయి మాస్క్!

Prevention of Malaria

Prevention of Malaria

మలేరియా సోకిన వ్యక్తిలో జ్వరం (39 నుంచి 41c) తీవ్రమైన చలి, తలనొప్పి, వాంతులు, చెమట పట్టడం, వికారం వంటి లక్షణాలను చూడవచ్చు.రక్త పరీక్ష చేయడం ద్వారా మలేరియా సోకిందో లేదో అనేది తెలుసుకోవచ్చు.
నివారణ చర్యలు: అనారోగ్యం మరియు మరణాలను తగ్గించడానికి మలేరియా నివారణ మరియు నియంత్రణ అవసరం. మలేరియా చికిత్స కోసం క్లోరోక్విన్ (300m.g.) అనే టాబ్లెట్ వారానికి రెండుసార్లు ఇవ్వాలి.

ముఖ్యంగా మలేరియా దోమల వల్ల వ్యాపిస్తుంది కాబట్టి మనం నివసించే ప్రాంతాల్లో దోమలు సంచరించకుండా చూసుకోవాలి ఇందుకు… నిలిచి ఉన్న నీటిపై దోమల యొక్క లార్వాలను చంపే మందులను చల్లాలి, అలాగే DDT, మలాథియాన్ వంటి మొదలగు మందులను పిచికారీ చేయాలి.

పురుగుమందులను పొగమంచు రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దోమల నివారిణిలు, రక్షణ దుస్తులు, వలలు, కాయిల్స్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా దోమల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మలేరియా కారణంగా వచ్చే రోగాలను నిరోధించడానికి దోమల ప్రదేశాలను తగ్గించే పద్ధతిని అవలంబించవచ్చు, అందులో డ్రైనేజీ వ్యవస్థ, నీటి మట్టం నిర్వహణ, వాటర్ కూలర్లను శుభ్రం చేయడం, ఇంటి లోపల మరియు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం మరియు నీరు నిలిచిపోకుండా ఉంచటం వలన దోమలు రాకుండా ఉంటాయి.ఇలాంటి చర్యలు తీసుకోవడం వలన మలేరియా వ్యాధిని నివారించవచ్చు.

Also Read: Importance of Personal Hygiene: వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత!

Leave Your Comments

Papaya Mask for Facial Beauty: ముఖ సౌందర్యం కోసం బొప్పాయి మాస్క్!

Previous article

Turmeric Medicinal Uses: పసుపులోని ఔషధ గుణాలు!

Next article

You may also like