Onion Peel Benefits: మనం ఏ వంట చెయ్యాలి అనుకున్న ఉల్లిపాయ కచ్చితంగా ఉండాలి. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం, వాటి ప్రయోజనాలు తెలిస్తే ఆచార్య పోతారు.
సాధారణంగా మనం వంటలో ఉల్లిపాయలని వాడుకొని, వాటి తొక్కలని పడేస్తాము. ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఏ, ఈ , సి ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ తొక్కలు చర్మ వ్యాధులకి, దురదలు, ఎలర్జీలకు వాడుతారు. ఉల్లిపాయ తొక్కల టీ రుచి బిన్నంగా ఉన్న దానిలోని పోషకాలు చర్మానికి, గుండెకి, కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read: Foxtail Millet Cultivation: ఖరీఫ్ సీజన్ ఆరంభం – లాభసాటిగా కొర్ర సాగును ప్రారంభించేద్దాం.!
ఉల్లిపాయ తొక్కలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని నీటిలో మరగబెట్టి వడగట్టి తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉల్లిపాయ తొక్కలో విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మాని ఆరోగ్యంగా, కాంతి వంతంగా చేస్తుంది.
ఈ ఉల్లిపాయ తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటితో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా అవుతుంది. ఉల్లిపాయల తొక్కలో ఫ్లేవనాయిడ్ల, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ ఉండటం ద్వారా ల్లెర్జిలు, ఇన్ఫెక్షన్ల మందుల తయారీలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ల్లిపాయ తొక్కలతో కంపోస్ట్ చేసి మొక్కలకి వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉల్లిపాయ, ఉల్లిపాయ తొక్కలో ఉన్నాయి అందుకే అన్నారు ఏమో మన పెద్ద వాళ్ళు ఉల్లి చేసే మేళ్లు తల్లి కూడా చెయ్యదు అని.
Also Read: Pest of Red Gram: కంది పంటలో తెగుళ్ల నివారణ.!