Incredible Benefits of Pears fruit. కొన్ని సంవత్సరాల క్రితం మనిషి సగటున 80 నుంచి 100 సంవత్సరాలు బ్రతికేవాడు. కానీ నేడు ముప్పై సంవత్సరాలకే అంతులేని రోగాలతో పోరాడుతున్నాడు. ముఖ్యంగా 40 వయసులో గుండె సంబంధిక సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఆరోగ్యంపై శ్రద్ధ తక్కువైతే చిన్న వయసులోనే అంతులేని రోగాల భారీన పడే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే కరోనా పుణ్యమా అని అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో శరీరానికి పోషకాలనిచ్చే పండ్ల కొనుగోలు అధికంగా పెరిగింది. ఇదే అదునుగా మార్కెట్లో పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ… ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు లభిస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియపోవచ్చు.శరీరానికి పియర్స్ ఫ్రూట్ ఎంతో మేలు చేకూర్చుతుంది. చూడటానికి ఆపిల్ పండును పోలి ఉండే పియర్స్ లో అధిక పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. Benefits Of Pears
పియర్స్ పండును తెలుగులో బేరి పండు అని కూడా అంటారు. ఈ పండులో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. అధిక పోషకాలు ఉండే ఈ పండుని మందుల తయారీలోనూ వాడుతున్నాయి పలు కంపెనీలు. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్యని పెంచుతాయి. ఇక డయాబెటిక్స్ ఉన్న వారు అన్ని రకాల పండ్లూ తినకూడదు. కానీ… పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్ తో అందరూ తినేందుకు వీలవుతోంది. పైగా ఇందులో మన శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
pears fruit benefits for health ఈ పండుని మహిళలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మహిళల్లో ముఖ్యముగా మోనోపాజ్ దశ దాటినవారికి గర్భ కోశ సమస్యలు తగ్గిపోతాయి. గుండె జబ్బులు రాకుండా సాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎలర్జీలను దూరం చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి.