ఆరోగ్యం / జీవన విధానం

Guava Leaves: జామ ఆకుతో వ్యాధులని ఎలా నివారించుకోవచ్చు.!

2
Guava Leaf
Guava Leaf

Guava Leaves: మనం రోజు ఆహారంలో ఏదో ఒక పండ్లని తింటూ ఉంటాం. పండ్లలో విటమిన్లు, పోషకపదార్థాలు ఎక్కువ ఉంటాయి అని అందరికి తెలుసు. పండ్లే కాదు వాటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి అంతో మేలు చేస్తాయి. జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా ? మనం పండ్లు, కూరగాయల పై పెట్టె శ్రద్ధ ఈ జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల తెలుసుకోము. జామ పండ్లతో పాటు జామ ఆకులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి.

జామ పండ్ల కంటే జామ ఆకులో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియ, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులో పాలీఫెనాల్సీ, టానిన్సీ, ఫ్లేవనాయిడ్సీ, కెరోటినాయిడ్లు కూడా ఉండటం ద్వారా కాళ్ళు నొప్పి తగ్గుతుంది. జామ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఉండడంతో ఈ ఆకు సప్లిమెంట్లను మార్కెట్లో అమ్ముతున్నారు.

Also Read: Weather Forecast: రైతులకి శుభవార్త మరో రెండు రోజులో వర్షాలు రాబోతున్నాయి.!

Guava Leaves

Guava Leaves

ఈ ఆకులు కాంప్లెక్స్ స్టార్చ్‌ని, కార్బోహైడ్రాట్లని చక్కెరగా మారకుండా బరువు తగ్గిస్తుంది. జామ ఆకు టీ తాగడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించి షుగర్ వ్యాధికి గురి కాకుండా చేస్తుంది. ఈ టీ సుక్రోజ్, మాల్టోస్ని శరీరం నుంచి తొలగిస్తుంది. ఈ జామ ఆకు టీ 12 వారాలు తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఈ టీ 3 నెలలు తాగితే ఎల్‌డిఎల్, చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్‌ తగ్గుతాయి.

జామ ఆకును జీర్ణ సంబంధ వ్యాధి చికిత్సకు వాడుతారు. ఫుడ్ పాయిజనింగ్‌, వాంతులు, కడుపు నొప్పికి కూడా వాడుతుంటారు. ఊపిరితిత్తుల సమస్యలో, బ్రోన్కైటిస్ చికిత్సలో మంచి ప్రభావం ఉంటుంది. గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి , పంటి నొప్పి, నోటి పుండ్ల, గార్గ్లింగ్ కోసం తాజా జామ ఆకులని వాడుతుంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న జామ పండ్లతో పాటు జామ ఆకుని మన రోజు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము.

Also Read: Smart Agriculture: స్మార్ట్ వ్యవసాయంతో కోటి రూపాయల టర్నోవర్.!

Leave Your Comments

Weather Forecast: రైతులకి శుభవార్త మరో రెండు రోజులో వర్షాలు రాబోతున్నాయి.!

Previous article

Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Next article

You may also like