Spirulina Health Benefits: మన భూభాగంలో అత్యదిక పోషకవిలువలు కలిగిన ఆహారం ఏదైనా ఉందా అని అంటె స్పిరులీనా అని చెప్పుకోవచ్చు. తల్లిపాలతో సమానంగా చూస్తున్న ఒకేఒక ఆహారం స్పిరులీన అని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఎంతో ఉపయోగం మరియు పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్స చాలా మందికి అవగాహన లేని ఆహారంగా మిగిలిపోతుంది. ఈ మధ్య కాలంలో దీన్ని పెంచెందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పెంచుకునే పద్ధతి: ముందుగా గుంతలను ని నిర్మించుకోవాలి. అవి చాలా కాలం ఎలాంటి లీకేజీ లేకుండా ఉండటానికి టార్పాలిన్ షీట్లను ఏర్పాటు చేసుకోవాలి.తరువాత సెన్సార్ మొటర్లను పెట్టుకోవాలి.సముద్రంలో పెరిగే ఈ నాచుని మనం శాస్ర్తీయ పద్ధతిలో పెంచాలంటే కొన్ని మెలకువలు వహించాలి.
ముందుగా నీటి పరీక్ష చేయించుకోవాలి.సముద్రపు నీరు ఉప్పు గా ఉంటాయి కాబట్టి అలాంటి పరిమాణాన్ని ఉంచుకోవాలి.అలా పీహెచ్ ను ఉంచడానికి కళ్ళుప్పుని వాడవచ్చు.స్పిరులీన పెరగడానికి నీమాయిల్,వంటసోడాసన్ ఫ్లవర్ నూనెలను వాడుతారు. సీడ్ ని వదిలిన తరువాత 15 రోజుల వరకు కదిలించకుండా ఉండాలి.ఆ తరువాత అనగా 16వ రోజు నుండి ప్రతిరోజు పంట తీసుకోవచ్చు.
Also Read: బరువు తగ్గడంలో సహాయపడే బియ్యం రకాలు
స్పిరులీనాని తింటె పోషక లోపాలు పోయి ఆరోగ్యం వస్తుందని మనం ఈ మధ్య కాలంలో వింటున్నాము. ఈ స్పిరులీన అనేది సయానో బ్యాక్టీరియా కి చెందిన ఒక రకమైన నాచు. దీనిని బ్లూ – గ్రీన్ ఆల్గె అని కూడా అంటారు. ఇది ఉప్పు నీటిలో మరియు మంచి నీటిలో కూడా పెరుగుతుంది. ఈ స్పిరులీనా అనె నాచుని పొడి చేసుకుంటె ఈ పొడిలోనె చాలా పోషకాలు ఉన్నాయి. 1993 లో ఇందులో ఉన్న పోషకాల ను బయటపెట్టారు. యు.యస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇచ్చిన లెక్కల ప్రకారం స్పిరులీనాలొ ఉన్న పోషకవిలువలను తెలుసుకుందాం.
ముఖ్యంగా విశేషమైనది ఏమిటంటే మనిషికి బాగా కావాల్సిన వాటిలో అన్నింటి కంటె ఎక్కువ ఏ ఆహారం లోలేని ప్రోటీన్లు దీనిలో ఉన్నాయి. మన శరీరానికి ఒక కేజీ బరువుకి పెద్దలందరీకీ 1గ్రా. , పిల్లలకు 2గ్రా.,గర్భినీ బాలలింతలకు 2 1/2 గ్రాముల ప్రోటీన్లు కావాలి.ఈ స్పిరులీనాలో 100 గ్రాములకి 57 గ్రా. ప్రోటీన్లు ఉంటాయి అనగా 57 శాతం.మామూలుగా ఇతర ఆహారాల్లో చూస్తె మేక మాంసంలో 21గ్రా.,కోడి మాంసంలో 25 గ్రా.,ప్రొద్దుతిరుగు గింజల్లో 29గ్రా., పుచ్చ గింజల్లో 34 గ్రా., సోయాబీన్ లో 43గ్రా., గ్రౌండ్ నట్ కేకులో 46-49 గ్రా., ప్రోటీన్లు ఉంటాయి.ప్రోటీన్ల లోపం ఉన్న వాళ్ళు ఈ పొడిని నీటిలో కలుపుకొని తాగితే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువే కేవలం 24గ్రా; ఫాట్ కేవలం 8గాములు.క్యాలెరీస్ చూసుకుంటే 100గ్రా.
నాచు పొడిలో 290క్యాలెరీల ఎనర్జీని ఇస్తుంది.ఈ స్పిరులీనాలో ఐరెన్ అనేది చాలా ఎక్కువ.100గ్రా. నాచు పొడిలో 29 మిల్లీ గ్రాముల ఐరెన్ ఉంటుంది.మన శరీరానికి ప్రతీ రోజు 28-30 మిల్లీ గ్రా.ఐరెన్ కావాలి.ఏ ఆహారంలో లేనంత ఎక్కువ సోడియం, తినడానికి అనుకూలంగా ఉన్నది ఈ స్పిరులీనాలో దొరుకుతుంది.100గ్రా.స్పైరులీనా పొడిలో 1000మిల్లీ గ్రా.సోడియం ఉంటుంది. మనం తాగే కొబ్బరి నీటిలో 100గ్రాములకు 105 మిల్లీ గ్రా., 100గ్రా కర్భూజాలో 103 మిల్లీ గ్రా., తోటకూర లో 230 గ్రా.సోడియం ఉంటుంది.
ఇవి సోడియం అధికంగా ఉన్న ఆహారాలు.మన శరీరానికి ఒక రోజుకి 280 మిల్లీ గ్రా.సోడియం కావాలి.రోజుకి ఈ పొడిని 10గ్రా తింటే సోడియం లోపం రాదు.ఇందులో పొటాషియం 1300మిల్లీ గ్రా.ఉంటుంది.సోడియం ఇంకా పొటాషియం అనె లవణాలు మన శరీరానికి ఆహారపదార్థాలు శక్తిగా మారటానికి, కణాల్లోకి వెళ్ళటానికి ,వ్యర్థాలను బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి.మన శరీరానికి ఒక రోజుకి 2500 మిల్లీ గ్రా.పొటాషియమ్ కావాలి.ఎందులో లేనన్ని మన శరీరానికి కావాల్సిన అమైనో ఆసిడ్స్ ఇందులో లభిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.
ఈ అమైనో ఆసిడ్స్ మన శరీరంలో జరిగే డిటాక్సిఫికేశన్ కు చాలా ఉపయోగపడుతాయి.1987 లో ఇది మన ప్రేగుల్లో ఉండే ఉపయేగకరమైన బాక్టీరియాను (లాక్టో బ్యాక్టీరియా వంటివి) పెంచుతుందని నిరూపించారు. దీని వల్ల ప్రేగుల్లో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.రక్షన వ్యవస్తకి ఇది తిరుగులేకుండా ఉపయేగపడుతుంది.
Also Read: కమ్మని ఉసురుల విందు