Alovera Plant: కలబంద (అలోవీరా)లో అనేక ఔష ధగుణాలున్నాయి. కలబంద ఆకుల రసాన్ని లేపనంగా వాడితే చర్మరోగాలు తగ్గు తాయి. వయస్సుతోపాటు వచ్చే ముడుతలను, మొటిమల వల్ల, కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను నివారించవచ్చు. కాంతివంతమైన చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది.
ముఖంపై ఏర్పడ్డ నల్లని మచ్చ లకు కలబంద రసాన్ని వెన్నతో కలిపి రాయాలి.సెగ గడ్డలు, దెబ్బలు తగిలిన ప్రదేశంలో కలబంద గుజ్జును ఉడి కించి కట్టాలి.కలబంద రసం పాలు, చక్కెరతో సేవిస్తే శరీరంలోని వేడితగ్గి, చల్లదనం కలగడంతో పాటు, ఆరోగ్యం, బలం సమకూరుతాయి.
ప్రకృతి ద్వారా వచ్చే కలబందలో 18 రకాల అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. అందువల్ల రోజూ 15-20 మి.లీ. చొప్పున ఉదయం, రాత్రి పడుకునే ముందు రసం సేవిస్తే కీళ్లనొప్పులు, జుట్టురాలు సమస్య తగ్గుతాయి. రసాని మలబద్ధకంతో బాధపడేవారికి ఉపశ మనం లభిస్తుంది. కలబందలో సహజసిద్ధమైన విటమిన్ ‘ఎ’ వల్ల కంటికి వాడవచ్చు చూపు మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారిలో బరువు తగ్గిస్తుంది. మధుమేహం, బి.పి., నొప్పి అలాగే కొలెస్ట్రాల్ వంటి సమస్యలను క్రమబద్దీకరిస్తుంది. కాలేయం, మూత్రపిం డాల పనితీరును క్రమ బద్ధీకరించి ప్రాణవాయువును పెంచి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read: Effect of Aloevera on Hair: జుట్టుపై కలబంద యొక్క ప్రభావం!
కుక్కకాటుపై కట్టాలి. దగ్గుకు కలబంద రసాన్ని ఒక స్పూను, మిరియాల పొడి అర బంద స్పూను, కొంతిపొడి పావు స్పూను కలిపి తేనెతో సేవించాలి.ఎక్కిళ్ల నివారణకు కలబంద రసాన్ని శొంఠి పొడితో కలిపి సేవించాలి..కలబంద రసాన్ని నీటిలో కలిపి, సేవిస్తే ప వడదెబ్బ పోతుంది. కండ్ల కలక వస్తే కలబంద గుజ్జును పసుపుతో ఉడికించి, గోరువె వా చ్చగా ఉన్నప్పుడు కనురెప్పలపై వేసి కట్టాలి.
పిల్లల్లో నులిపురుగుల నివార ణకు 2 స్పూన్ల కలబంద రసంలో, చిటికెడు పొంగించిన ఇంగువ కలిపి పిల్లలకు పట్టించాలి.కలబంద గుజ్జు, గోధుమ పిండి,వాము, సైందవ లవణం, జీలకర్ర కలిపి చపాతీలుగా చేసుకొని తింటే చక్కె కడపులో గ్యాసు, ఉబ్బరం తగ్గుతాయి.ప్రతి నెల ముట్టు శూలతో బాధ పడే స్త్రీలు కలబంద ఆకుల రసాన్ని వారం రోజులు తాగాలి..
పంటి నొప్పికి కలబందకు రసాన్ని చిగుళ్లకు పట్టించాలి లేదా తొక్కు తీసిన కలబంద గుజ్జు ముక్క లను నమలాలి.చెవిపోటు ఉన్నట్లయితే కల అధిక బంద ఆకును వేడిచేసి రసం తీసి చెవిలో ఒకటి, రెండు చుక్కలు వేస్తే బి.పి. నొప్పి తగ్గుతుంది.పరిపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. మొక్క ఈ ఇంటి కలబంద ముందర దిష్టి తగలకుండా కట్టడం సాంప్రదాయం కూడా ఉంది.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Health Benefits of Aloe Vera: చేదుగా ఉండే కలబందతో చెప్పలేనన్ని ప్రయోజనాలు!!
Also Watch: