Health Benefits of Chicken : ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి అయి వినియోగింపబడేది పంది మాంసం. తరువాత స్థానం కోడిమాంసంది. మన దేశంలో, అలాగే మన రాష్ట్రంలో కూడా కోడి మాంసం ప్రథమ స్థానంలో ఉంది. మత పరమైన కారణాలు, అలవాట్ల వల్ల గొడ్డుమాంసం, పందిమాంసం వినియోగం తక్కువ. గొర్రెమాంసం, మేకమాంసానికి గిరాకి ఉన్నా ఖరీదెక్కువ. పైగా ఆరోగ్య అవగాహనతో ప్రజలు కోడిమాంసంపై మక్కువ చూపిస్తున్నారు. అంతేగాక కోడిమాంసంలో కల్తీ అవకాశాలు తక్కువ.

Health Benefits of Chicken
మాంసాల్లో రకాలు : మాంసాల్లో తెల్ల మాంసం, ఎర్రమాంసం అనేవి రెండు రకాలు. కోడి, ఇతర పక్షుల మాంసం, కుందేలు మాంసం తెల్లమాంసం. ఇది లేత రంగులో ఉండి కండరాలు విడిగాను, కొవ్వు విడిగాను, తక్కువగాను ఉంటుంది. ఎర్రమాంసం ముదురు రంగులో ఉంటుంది. దీని కింద గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రెమాంసం, మేకమాంసం వస్తాయి. దీనిలో కొవ్వు కండరాలతో కలసి ఉంటుంది. పైగా కొవ్వు ఎక్కువ.
మాంసం కోళ్ళలో రకాలు : మాంసానికి ఉపయోగించే కోళ్ళలో కేవలం మాంసం కోసం ఉపయోగించే బ్రాయిలర్లు ముఖ్యమైనవి. బ్రాయిలర్ కోళ్ళను 5-6 వారాలకు అమ్ముతారు. గుడ్లుపెట్టే కోళ్ళను కేజ్లలో ఉంచుతారు. బ్రాయిలర్లను నేలపై డీప్లిట్టర్ పద్దతిలో పెంచుతారు. గ్రామాల్లోని నాటుకోళ్ళు గుడ్లు పెట్టిన తరువాత మాంసానికి అమ్ముతారు. వీటి ధర ఎక్కువ. ఇవి బయట గింజలు, పురుగులు, గడ్డి మొదలగునవి తింటాయి.

Types of chicken
అందుకే ఈ మాంసంలో కొవ్వు తక్కువ. రుచికరం. ఆరోగ్యకరం కూడా. అయితే ఈ మధ్య పెరటి కోళ్ళని వనరాజు, గిరిరాజ, గ్రామప్రియ, రాజశ్రీ మొదలగు రకాలొచ్చాయి. ఇవి ప్రధానంగా విదేశీజాతుల్ని సంకరపరచగా వచ్చినవి. నాటుకోళ్ళలాగా ఇవి గుడ్లను పొదగవు. లేయర్ కోళ్ళలో సెక్సింగ్ చేసి ఆడపిల్లల్ని ఉంచి మగపిల్లల్ని తీసివేస్తారు. బ్రాయిలర్ కోళ్ళలో అన్నీ కలిపి ఉంటాయి.
కోడి మాంసం వలన ఆరోగ్యానికి లాభాలు : కోడిమాంసం తింటే కడుపు నిండినట్లు ఉంటుంది. చాలా సేటి వరకు ఆకలి వేయదు. దీంతో ఇతర ఆహార పదార్థాలను చిరుతిండిగా తినం. అందుకే బరువు తగ్గుతాం. పైగా ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పిండి పదార్థాల ఆహారంలో పొట్టచుట్టూ కొవ్వు లేకుండా చదునుగా ఉంటుంది. డ్యూకన్ డయెట్ అనే ఈ అమెరికాలో ప్రాచుర్యం పొందింది. కోడి మాంసం లీన్ మాంసం. అంటే మాంనకృత్తులు ఎక్కువ, కొవ్వు తక్కువ. ఉన్న కొద్ది కొవ్వూ మంచిరకం కొవ్వు.
వయసు పెరిగిన వారి ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటే ఎముకలు గట్టిగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్దు. కాళ్ళమాంసం ముదురు రంగులో ఉండటానికి మయోగ్లోబిన్ కారణం. దీంట్లో ఇనుము, జింక్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కోడి రెక్కలు కూడా ఆరోగ్యకరం. చవక. ఒకప్పుడు అమెరికాలో పారవేసే కోడి రెక్కలతో ఇప్పుడు ‘బఫెలో వింగ్స్’ అనే విశేష ప్రసిద్ధి చెందిన వంటకాన్ని చేస్తున్నారు. వివిధ దేశాల ఆహారాలలో మిక్కిలి ఆరోగ్యకరమైన మెడిటెర్రేనియన్ ఆహారంలో కోడి మాంసానికి ప్రత్యేక థైరాయ స్థానముంది.
అలాగే ఫుడ్ పిరమిడ్ లో కూడా. కోడిమాంసం గుండెకు మంచిది. కోడిమాంసంలోని ఇనుము సెరొటోనిన్ అనే హార్మోనును ఉత్పత్తి చేసి మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్ను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇనుము ఎంతైనా అవసరం. దీంట్ కోడిమాంసంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని వివిధ కణాలకు తీసుకుని వెళ్తుంది. స్త్రీలకు ఆహారంలో ఇనుము ఎంతైనా అవసరం. ఎనీమియా వస్తుంది. ఇనుము వెంట్రుకల పెరుగుదలకు పనిచేస్తుంది. ఇనుముతో వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉంటాయి. ఇనుము తగ్గితే జుట్టురాలిపోయి బట్టతల వస్తుంది. ఇనుము కణాల పెరుగుదలకూ పనిచేస్తుంది. మాంసాహారం పునరుత్పత్తికి దోహదపడుతుంది.
Also Read: Diarrhea in Chickens: కోడి పిల్లలలో పుల్లోరం వ్యాధి ఎలా వస్తుంది.!
కోడి మాంసంలోని మాంసకృత్తులలో మన శరీరానికి కావలసిన 8 అత్యవసర ఎమైనో ఆమ్లాలుంటాయి. వీటిని శరీరం తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారా రావలసినదే. టైరోసిన్ అనే ఎమైనో ఆమ్లం నరాల సంకేతకాలైన డోపోమైన్, నార్ఎపినెఫ్రీన్, ఎపినెఫ్రీన్లను ఉత్పత్తి చేసి శ్రద్ధను, ఏకాగ్రతను, శక్తిని పెంచుతుంది.కోడి మాంసంలో క్యాన్సరును నిరోధించే బి విటమిన్ నియాసిన్ (బి3) ఎక్కువగా ఉంది. దీనితో వయసుతో వచ్చే మతిమరుపు (డెమెన్షియా), ఆల్టైమర్స్ వ్యాధులకు అవకాశం తగ్గుతుంది.
కోడిమాంసంలోని విటమిన్ బి6 (పిరిడాక్సిన్) తో కలసి నియాసిన్ శరీరంలో శక్తి వినియోగానికి పనిచేస్తుంది. నియాసిన్, బి6 మధుమేహాన్ని నియంత్రిస్తాయి. విటమిన్ బి6 గుండె, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ బి3 మెటబాలిజము, బి6 వ్యాధి నిరోధక శక్తికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, బి7 (బయోటిన్) కణాల పెరుగుదలకు పనిచేస్తాయి. అలాగే బి12 నరాల, రక్త కణాల ఆరోగ్యానికి పనిచేస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు బి3, బి6 అలసటను పోగొట్టి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Fowl Typhoid in Chickens: కోళ్ళలో ఫౌల్ టైఫాయిడ్ వ్యాధి.!
Must Watch: