ఆరోగ్యం / జీవన విధానం

Drumstick Leaves health benefits: మునగా ఆకు ఎన్నో వ్యాధులకు సహజ ఔషధం

0

Drumstick Leaves శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో ఆకు కూరలు ఒకటి. నగరాల్లో తోటకూర( Amaranth), గోంగూర(Gongura) , మెంతికూర(Fenugreek), పాల కూర వంటి వాటిని మాత్రమే సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. అయితే పల్లెల్లో మాత్రంఈ ఆకు కూరలతో పాటు.. చేల మెట్లమీద దొరికే పొన్నగంటి కూర వంటి వాటితో పాటు మునగాకుని కూడా తినే ఆహారంలో కూరలు చేసుకుంటారు. అయితే సాంబారులో, కూరల్లో వాడే మునక్కాయల కంటే.. అత్యధికంగా మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలున్నని అంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులో దాదాపు 300 రకాల వ్యాధులను తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయని చెబుతున్నారు. అయితే నేటికీ గ్రామాల్లో మునగాకుని పప్పులో వేసుకుని లేదా పొడిగా చేసుకుని తింటారు. ఇక ఈ మునగాకుని సాంప్రదాయ వైద్యంలో 4 వేల ఏళ్ల క్రితం నుంచి ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో మునగాకుకూరను.. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తింటారు.

ఆరోగ్య ప్రయోజనాలు

  • అమైన్ యాసిడ్స్, విటమిన్స్, ఖనిజాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయి.
  • దీనిలో క్యారెట్ కంటే కూడా అధికంగా విటమిన్ ఏ ఉంది. కనుక కళ్ళకు మునగాకు మేలు చేస్తుంది.
  • దీనిలో పాల కంటే క్యాల్షియం 17 రెట్లు అధికంగా ఉంది. కనుక ఎముకలకు మంచి క్యాల్షియాన్ని అందిస్తుంది.
  •  తక్షణ శక్తినిచ్చే అరటి అరటిపండులో ఉండే పొటాషియం.. మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.
  • పెరుగులో ఉన్న ప్రొటీన్ల కంటే మునగాకులో ఎన్నో రేట్లు అధికంగా ప్రోటీన్లు ఉన్నాయి.
  •  థైరాయిడ్సక్రమంగా పనిచేసేలా చేసే సహజ ఔషధం మునగాకు అని సాంప్రదాయ వైద్యులు చెబుతారు.

  •  కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు.. మొదట్లోనే మునగాకుని పేస్ట్ గా చేసి.. కీళ్ళకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కంటి చూపు మెరుగుపడడానికి, రేచీకటిని నివారించడానికి మునగాకు రసం మంచి ప్రయోజనకారి.
  • బాలింతలకు పాలు పడడం కోసం మునగాకు కూరని పెడితే.. పుష్కలంగా చంటిబిడ్డకు పాలు లభిస్తాయి.
  • గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు మునగాకు రసం, దోసకాయ రసం కలిపి రోజూ తాగితే సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  •  ఆస్తమా, టీబీ, దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారికి మునగాకు కాషాయం మంచి ఔషధం. ఒక గ్లాసు నీరు తీసుకుని మునగాకులను ఆ నీళ్లలో వేసి మరిగించి చల్లార్చాలి. అప్పుడు కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకుని తాగితే ఆ నీటిని తాగితే.. దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave Your Comments

Castor Semilooper Management: రబీ ఆముదంలో దాసరి పురుగు యాజమాన్యం

Previous article

Foodgrains: 2021-22లో ప్రధాన పంటల ఉత్పత్తుల అంచనా

Next article

You may also like