Benefits of kiwi: ప్రతి రోజు ఉదయం సమయంలో ఈ పండు తింటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బీ6 ఉండడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. సాధారణంగా పండ్లు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి..అందుకే ఏ సీజన్‌లో వచ్చే ఆ పండ్లను ఆ సీజన్ తప్పక తినాలి.ప్రకృతిలో లభించే పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో లభించే పోషకాలు ఎందులోను లభించవు. ఇక కీవిలో అయితే పుష్కలంగా పోషకాలుంటాయి.
కీవీ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కీవి పండ్లను తింటే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కీవి పండ్లను ఉదయం తినడం ద్వారా గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక ఈ పండు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
కీవీ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ, విటమిన్ కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే పరిగడుపున కీవీ పండ్లను తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
దీని ద్వారా అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నివారించవచ్చు.పోషకాలు అధికంగా కలిగిన కీవి పండ్లను తింటే శరీరంలో పోషకాల కొరతను తీరుస్తుంది. ప్రతీ రోజు కీవి పండ్లను తింటే బరువు తగ్గుతారు. కీవి పండ్లలో పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంత మంది ఆరోగ్యంగా ఉండడానికి కీవి పండ్లను అధిక మోతాదులో తీసుకుంటారు. కీవిని ఎక్కువగా తినడం ద్వారా కడుపునొప్పి, అలర్జీ, కిడ్నీ సమస్యలు వస్తాయి .
కీవి పండ్లను రోజుకు మూడు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం ఒక గ్లాస్ కీవి జ్యూస్ మాత్రమే తాగాలి ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీని ద్వారా అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నివారించవచ్చు.