ఆరోగ్యం / జీవన విధానం

Apple Health Benefits: యాపిల్‌ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

0
Apple Health Benefits
Apple Health Benefits

Apple Health Benefits: యాపిల్‌లో ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక యాపిల్ తింటే.. డాక్టర్ దగ్గరికి వెళ్లే అవకాశమే రాదంటూ పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఉదయం పూట పరగడుపున యాపిల్‌ తింటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది.

Apple Health Benefits

Apple Health Benefits

పోషకాలు: యాపిల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్‌ను ఖాళీ కడుపుతో తింటే అన్ని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. శరీరంలోని అవసరమైన పోషకాల కొరత తీరుతుంది. అయితే మీడియం సైజు యాపిల్స్‌లో పొటాషియం, విటమిన్ సి కూడా ఉంటాయి.

Also Read: Henna Farming: మెహందీ సాగు కూడా రైతులకు మంచి ఆదాయ వనరు

రోగనిరోధక శక్తి: వివిధ వ్యాధులతో పోరాడటానికి శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక యాపిల్ తినడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. యాపిల్స్‌లోని విటమిన్ సి, ప్రొటీన్, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుండె: ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే ఫైబర్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాపిల్స్‌లో విటమిన్ సి, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తాయి.

బరువు: బరువును నియంత్రించుకోవాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినడం మంచిది. రోజూ ఉదయం ఒక యాపిల్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. యాపిల్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మీరు క్రమంగా బరువు తగ్గుతారు.

వాపు పోతుంది: యాపిల్ పండ్లను తొక్కతోనే తినడం చాలా మంచింది. ఖాళీ కడుపుతో యాపిల్ తొక్క తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. యాపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: Egg Price: వేడి కారణంగా భారీగా తగ్గిన కోడిగుడ్ల ధరలు

Leave Your Comments

Tinda Cultivation: వేసవిలో టిండా సాగు పద్ధతులు

Previous article

Natu Kolla Pempakam :పెరటి కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like