వార్తలు

International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యత, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఈ సంవత్సరం థీమ్..

2
International Yoga Day
International Yoga Day

International Yoga Day 2023: యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియపరచడానికి ప్రతి సంవత్సరం జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా దినోత్సవంగా కూడా పిలుస్తారు. యోగా అభ్యాసాన్ని జరుపుకోవడానికి మరియు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఒక రోజు. ఈ రోజును (జూన్ 21) 2014 నుండి జరుపుకుంటారు. UN జనరల్ అసెంబ్లీచే అంతర్జాతీయ గుర్తింపు దినోత్సవంగా గుర్తించబడింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత: యోగా సాధనను గుర్తించి, గౌరవించేలా అంతర్జాతీయ దినోత్సవం చేయాలనే ఆలోచనను 2014 సెప్టెంబర్ 27న UN జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా చేశారు. ఈ రోజు (జూన్ 21) ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం నాటి తేదీని ప్రతిపాదించింది ఆయనే. ఈ రోజు (జూన్ 21) వేసవి కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. సంవత్సరంలో పొడవైన రోజు కూడా. ఆ తర్వాత 11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ ప్రతిపాదనను 175 సభ్య దేశాలు ఆమోదించాయి. తరచుగా యోగా సాధన చేస్తే, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీర భంగిమలలో మార్పులు సంభవిస్తాయి. యోగా కార్యకలాపాలలో, ధ్యానంలో పాల్గొనడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: UP CM Yogi Adityanath: నేరుగా రైతులు అగ్రి మాల్‌లో పండ్లు, కూరగాయలను విక్రయించవచ్చు – యూపీ సీఎం

International Yoga Day 2023

International Yoga Day 2023

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023: థీమ్

‘వసుధైవ కుటుంబానికి యోగా’, 2023 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్.

యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రతిరోజు యోగా చేయడం వలన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. యోగ చెయ్యడం వలన శరీరం యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఫిట్ గా తయారవుతుంది. యోగ మానసిక ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, తరచుగా పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా యోగాసనాలు వేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కండరాల బలహీనత, శరీర బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ప్రత్యేక ఆసనాలు వేయాలి.

Also Read: Robo Weeder: కలుపు నివారణకి రోబో కూలీలు…..

Leave Your Comments

Robo Weeder: కలుపు నివారణకి రోబో కూలీలు…..

Previous article

Heatwaves: పంటల పై వడగాలుల ప్రభావం.!

Next article

You may also like