Solar Powered Fan to Grill Corn: వర్షాకాలం వచ్చింది అంటే అందరం మొక్కజొన్న కంకులని రోడ్ పై అమ్మే వారి దగ్గర ఇష్టంగా కొనుకొని తింటాం. ఈ మొక్కజొన్న కంకులని అమ్మే వ్యాపారులు వాటిని కాల్చదని చాలా కష్టపడుతుంటారు. వాటి కోసం ఒక తోపుడు బండిలో బొగ్గులతో ఒక పొయ్యి ఏర్పాటు చేస్తారు. ఆ బొగ్గులు ఎప్పుడు వేడిగా ఉండటానికి విసన కర్రతో గాలిని అందిస్తూ ఉంటారు.
ఒక మొక్కజొన్న కంకిని కాల్చి ఇవ్వడానికి వ్యాపారులు చాలా శర్మ పడుతూ ఉంటారు. ఈ శ్రమని చూసి ఒక 75 సంవత్సరాల మహిళ ఒక కొత్త ఆలోచన చేసింది. సెల్వమ్మ టెక్నాలజీ వాడుతూ , శ్రమని తగ్గించింది.
మొక్కజొన్న కంకులని కాల్చడానికి ఒక కొత్త పరికరాని తయారు చేసుకుంది. తన తోపుడు బండిలో ఒక సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంది. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఒక చిన్న లైట్, ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంది.
సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన విద్యుత్ శక్తితో లైట్ వస్తుంది. దాని ద్వారానే ఫ్యాన్ తిరుగుతుంది. ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరగం వల్ల విసన కర్ర వాడే అవసరం ఉండదు. బొగ్గుల పొయ్యి కూడా ఫ్యాన్ తిరగడం వల్ల మంచిగా వస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ మొక్కజొన్న కంకులను కాల్చుకొని అమ్ముకోవచ్చు. తొందరగా మొక్కజొన్న కంకులను కాల్చడం వల్ల వినియోగదారులకు తొందరగా అందించవచ్చు. దాని వల్ల వినియోగదారుల సమయం వృధా అవకుండా, మంచి వ్యాపారం తొందరగా చేసుకోవచ్చు.
Perfect example of technology reaching the last person of the society. 75-year-old Selvamma uses a solar-powered fan to grill corn and a LED tube. Look at the irony, she does it diagonally opp to the seat of power – Vidhan Soudha. Govt couldn’t empower her, technology did. pic.twitter.com/deekI58ROi
— Harish Upadhya (@harishupadhya) January 24, 2019