వార్తలు

ప్రకృతిపై ప్రేమతో వినూత్నంగా ఆలోచించిన ఆటో డ్రైవర్ జక్రయ్య..

0

సాధారణంగా ఎండాకాలంలో ఆటోలపై గోన సంచులను కప్పేస్తుంటారు డ్రైవర్లు. చల్లదనం రావడానికి వాటిపై నీళ్లు చల్లుతూ ఉంటారు. కానీ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు. ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆటోలో డ్రైవర్ సీటుకు ముందు భాగాన్ని మొక్కలతో గార్డెన్ లా నింపేసాడు. ఆటో రోడ్డు మీద వెళ్తుంటే కదులుతున్న గార్డెన్ లా అనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ గా ఆలోచించిన ఆ డ్రైవర్ పేరు CH. జక్రయ్య. చిన్నప్పటి నుంచి ప్రకృతిని ఇష్టపడే జక్రయ్య ఆటోలో కూడా మొక్కలు పెంచాలని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా చిన్నపాటి గార్డెన్ ను తలపిస్తున్న ఈ ఆటో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave Your Comments

పామారోజా గడ్డి సాగుతో .. రైతులకు ఉపాధి

Previous article

రామాఫలం ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like