వార్తలు

ఈ వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు..

0

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పెరిగిపోయింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఇక గ్రామాల్లో తక్కువ పనులు, చేసిన పనికి తగిన డబ్బులు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు ఇంక అధికమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సమయంలో మీరు గ్రామాల్లో ఉంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు. వీటివలన డబ్బు సంపాదించడమే కాకుండా మీ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించవచ్చు. ఈ వ్యాపారాలు చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం..
పాల వ్యాపారం:
మీకు ఆవు, గేదెలు కనుక కలిగి ఉంటే మీరు పాల వ్యాపారం చేయడం ఉత్తమం. పాల వ్యాపారం చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుత ఆధునాతన పద్ధతులను ఉపయోగిస్తూ ఈ వ్యాపారం చేయడం వలన సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.
BMC ప్రారంభించడం:
BMC అంటే బల్క్ మిల్క్ కూలర్ అని అర్థం. ఇందు కోసం మీ స్థలం లో మొక్కలను పెంచడం, పశువులను పెంచడం ద్వారా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎక్కువ మోతాదులో పాల సేకరణ చేయడం. అవి పాడవకుండా యంత్రాల ద్వారా దాచడం చేయవచ్చు. అలాగే వాటిని నగరాల్లో వీటిని విక్రయించవచ్చు. ఇందుకోసం మీరు ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది.
విత్తనాలు, ఎరువులు దుకాణం:
ఇది గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగపడే వ్యాపారం. రైతులకు విత్తనాలు, ఎరువుల పట్ల అవగాహన కల్పిస్తూ ఆధునాతన పద్ధతుల వస్తువులను తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.
మెడికల్ స్టోర్ :
ఇక ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాపారం గ్రామాల్లో అతి ముఖ్యం. ఇందుకోసం ముఖ్యముగా మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఎక్కువగా అవసరమయ్యే మందులను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు.
నేల ఆరోగ్య కార్డుతో ల్యాబ్ ప్రారంభించడం:
సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి ప్రయోగ శాలలు చాలా తక్కువగా ఉన్నాయి. పొలంలో మట్టిని ప్రయోగశాలలో పరిశీలించి అందులో లభించే పోషకాలను నిర్ధారించాలి. మట్టి నమూనాను తీసుకోవడానికి పరీక్షించడానికి నేల ఆరోగ్య కార్డును అందించడానికి ప్రభుత్వం ఒక నమూనాకు రూ. 300 ఇస్తోంది.

Leave Your Comments

బ్లాక్ కాఫీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదిక..

Next article

You may also like