YONO Krishi Mandi Huge Discounts To Farmers భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతుల కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలో రబీ సీజన్ మొదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా YONO కృషి యాప్ ద్వారా విత్తనాలు, పురుగుమందులకు ఆఫర్లు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే.. ఆఫర్లతో పాటు తక్కువ ధరకే విత్తనాలు, పురుగుమందులు అందించనుంది ఆ సంస్థ.
రైతు అవసరాల మేరకు విత్తనం నాటిన నుండి కోత కోసే వరకు యోనో కృషి YONO Krishi Mandi సేవలు అందించనుంది. ఇక హోమ్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించింది సదరు బ్యాంక్. దాదాపుగా 27000 ప్రదేశాలలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అలాగే ఈ పోర్టల్ ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, పురుగుమందులు, సేంద్రీయ ఉత్పత్తులు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు చేసుకోవచ్చు.
మరోవైపు యోనో కృషిలో నాలుగు విభాగాలు ఉన్నాయి: అగ్రి గోల్డ్ లోన్‌లు, రైతుల పెట్టుబడి & బీమా అవసరాల కోసం ఆర్థిక సూపర్‌స్టోర్ అయిన బచాట్, మిత్ర (వ్యవసాయ సలహా సేవలు) మరియు మండి (వ్యవసాయ ఇన్‌పుట్‌లు & కొనుగోలు కోసం ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ వంటి వ్యవసాయ క్రెడిట్ సొల్యూషన్‌లను అందిస్తుంది. కాగా.. Yono SBI ద్వారా ఇప్పటికే అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. షాపింగ్, ప్రయాణం, బిల్లులు చెల్లించడం, రీఛార్జ్ చేయడం, IRCTC టిక్కెట్ బుకింగ్ పొందేందుకు పెట్టుబడి పెట్టడం, డబ్బును బదిలీ చేయడానికి UPIని ఉపయోగించడం తదితర సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. SBI YONO Krishi Mandi