Why FCI Does Not Want To Procure Paddy From Telangana ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ సర్కారు ఫైర్ అయింది. జీరో స్పేస్ పేరుతో ధాన్యం సేకరించడం లేదంటూ మండిపడింది. ఎఫ్‌సీఐ గోదాంలో ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉంటుంది. కొత్త బియ్యాన్ని తీసుకుని నిల్వ చేయాలి. దీనికోసం వ్యాగన్ల సంఖ్య పెంచాలి, లేదా అదనపు గోదాములు ఎర్పాటు చేయాలి. కానీ ఎఫ్‌సీఐ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ధాన్యం అలానే ఉంచడం వల్ల బియ్యం సేకరణలో జాప్యం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వట్లేదంటూ రాష్ట్ర సర్కారుపై ఆరోపణలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఇకపోతే ఎఫ్‌సీఐ వద్ద ధాన్యం కుప్పలుతెప్పలుగా ఉన్నది. ధాన్యం సేకరించకపోవడంతో రైతన్నలు నిరీక్షించాల్సి వస్తుంది.
ధాన్యాన్ని నిలువ చేసేందుకు గోదాములు అద్దెకు లభిస్తున్నప్పటికీ అధికారులు అవేం పట్టించుకోకుండా జీరో స్పేస్ తో సేకరణకు అడ్డు పడుతున్నారు. తెలంగాణ ధాన్యాన్ని తీసుకోవడం ఇష్టంలేకే జీరో స్పేస్ తో నాటకం ఆడుతుందని సర్కారు మండిపడుతుంది. వరంగల్ జిల్లా నెక్కొండలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి ధాన్యం తరలింపుకు 30 వ్యాగన్లు కెటించాల్సి ఉంటుంది. కానీ అక్కడ కేవలం 10 వ్యాగన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో గోదాముల్లో స్పేస్ లేకుండా పోతుంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 1.20 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోదాములను ఎఫ్‌సీఐ నిర్వహిస్తున్నది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ తదితర జిల్లాల బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేస్తారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో పూర్తిస్థాయిలో బియ్యం నిల్వలున్నాయి. అయితే ధాన్యాన్ని అక్కడినుంచి తరలించే క్రమంలో జాప్యం జరుగుతున్నది.
Telangana Paddy, FCI, Telangana Govt