వార్తలు

పాల ఉత్పత్తికి ప్రాణం పోసిన మిల్క్ మ్యాన్…

0
who is milk man of india
who is milk man of india

మానవ దైనందిన జీవితంలో పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు మనం పాలతో సహవాసం చేస్తుంటాము. అసలు ఉదయాన్నే టి లేకపోతే మైండ్ పనిచేయదు అన్నంతలా మారిపోయింది పాల వినియోగం. కానీ పాల గురించి తెలుసుకునేముందు మిల్క్ మ్యాన్ అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలబెట్టిన వ్యక్తి వర్గీస్ కురియన్.

1921 నవంబర్‌ 26న కేరళ రాష్ట్రంలోని కాలికట్‌లో జన్మించారాయన. దేశ ప్రజలు పౌష్టికాహర లోపంతో బాధపడకుండా కురియన్‌ చేసిన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. ఆయన జయంతిని ‘జాతీయ పాల దినోత్సవం’గా నిర్వహిస్తూ గౌరవిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో పాల లోటు ఏర్పడింది. దాంతో, పాల ఉత్పత్తిలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా కురియన్ నేతృత్వంలో చర్యలు ప్రారంభమయ్యాయి. 90వ దశకంలోకి అడుగుపెట్టగానే భారత్ పాల ఉత్పత్తిలో అమెరికాను కూడా వెనక్కు నెట్టింది. రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలన్న సంకల్పంతో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అంటే ప్రస్తుత అమూల్‌ మిల్క్ ను విజయవంతంగా నిర్వహించారు.

ఇకపోతే ఆసియాలో రూ.52 వేల కోట్ల అతిపెద్ద టర్నోవర్‌ కలిగిన డెయిరీగా అమూల్‌ మిల్క్ రికార్డుల్లో స్థానం స్థానం సంపాదించింది. మరో విశేషం ఏంటంటే ఈ అమూల్ మిల్క్ కి ఏజెంట్, కంపెనీలతో కాకుండా రైతులతో మమేకమై ఈ పాల ఉత్పత్తి మొదలైంది. కేవలం రైతుల నుంచి మాత్రమే 250 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయడం, ప్రాసెస్‌ చేయడం దీని ప్రాముఖ్యత. ఈ సంస్థలో 11 వేల గ్రామాల్లో 20 లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. సహకార రంగంలో పాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో ఇది కొత్త చరిత్ర.

డాక్టర్ కురియన్ ను ఆయనను భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ కార్యక్రమంగా పేరుగాంచిన ‘ఆపరేషన్ ఫ్లడ్’కి ఇప్పటికీ ప్రసిద్ధి చెందిన భారతీయ సామాజిక వ్యవస్థాపకుడు. అతను వివిధ రైతులు మరియు కార్మికులచే నిర్వహించబడుతున్న 30 సంస్థలను స్థాపించాడు. అమూల్ బ్రాండ్ స్థాపన మరియు విజయంలో డాక్టర్ కురియన్ కీలక పాత్ర పోషించారు. అతని ప్రయత్నాల కారణంగానే, భారతదేశం 1998లో U.S.ని అధిగమించి అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది.

కొన్ని కారణాల వల్ల 2006లో కురియన్ అమూల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక అయన జీవితంలో అనేక అవార్డులు అందుకున్నాడు. అందులో రామన్‌ మెగసెసే అవార్డు(1963), వాట్‌లర్‌ పీస్‌ ప్రైజ్‌(1986), వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌(1989), పద్మశ్రీ(1965), పద్మభూషణ్‌(1966), పద్మ విభూషణ్‌(1999) ముఖ్యమైనవి. డాక్టర్ కురియన్ 2012 సెప్టెంబర్‌ 9న 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

#whoismilkmanofindia #VergheseKurien #Amulmilk #agriculturalnews #eruvaaka

Leave Your Comments

మహిళా రైతులకు కోర్టెవా గౌరవ సన్మానం…

Previous article

తమిళనాడులో భారీ వర్షాలకు నీటమునిగిన 1.5 లక్షల ఎకరాలు…

Next article

You may also like