ఆధునిక పంటల సాగు చేస్తే లాభాలు గడించవచ్చని రైతులకు తెలిసినా ధైర్యం చేసి అటువైపు మళ్లలేకపోతున్నారు. బాన్సువాడ మండలానికి చెందిన రైతులు మాత్రం విభిన్న పంటలు సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టణానికి చెందిన ఖాజా బోర్లం క్యాంప్ గ్రామంలో… కాద్లపూర్ గ్రామానికి చెందిన కుర్మ మశ్నలు గతంలో వరి , మొక్కజొన్న,సోయా, కంది పంటలు పండించారు. సరైన ఆదాయం రాక ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. పుచ్చకాయ సాగును ఎంచుకున్నారు. అంతర్జాలంలో చూసి ఆచరణలో పెట్టారు.
పంటకు కావాల్సిన నీరు, ఉష్ణోగ్రతలను సమపాళ్లలో అందించేందుకు మల్చింగ్ విధానం ఉపయోగపడుతుంది. రైతులు ఈ పద్ధతిలో పుచ్చకాయను సాగు చేస్తున్నారు. పంటలో కలుపు నివారణతో పాటు కాయలకు మట్టి అంటుకోకుండా ఉంటుంది. 90 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టగా, 40 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఖర్చులు పోనూ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోంది.
మల్చింగ్ విధానంలో పుచ్చసాగు..
Leave Your Comments