వార్తలు

PJTSAUలో వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు NCC & స్పోర్ట్స్ కోటాలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

0
PJTSAU COUNSELLING FOR DEGREE COURSES

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల బై.పి.సి స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఎన్.సి.సి స్పోర్ట్స్ కోటా ఒరిజినల్ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ తెలిపారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఎన్.సి.సి, స్పోర్ట్స్ కోటాలో సీట్లు పొందాలనుకొంటున్న అభ్యర్థులు సంభందిత తేదీలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 26న ఎన్.సి.సి కోటా అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ , ఈ నెల 27వ తేదీన స్పోర్ట్స్ కోటా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకోసం విశ్వ విద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.inలో చూడాలని సూచించారు.

Leave Your Comments

టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Previous article

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

Next article

You may also like