VC Praveen Rao launches multi-spectral sensor drone సాంకేతికరంగంలో దేశంలో రానున్న భవిష్యత్తు విప్లవం ఎమర్జింగ్ టెక్నాలజీదేనని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. సెన్సాకేర్ సంస్థ నూతనంగా ప్రవేశపెడుతోన్న మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ డ్రోనును ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు బుధవారం ప్రారంభించారు. అగ్రిహప్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మల్టీ స్పెక్టల్ డ్రోను multi-spectral sensor drone ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను సంబంధిత లబ్దిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. వ్యవసాయరంగంలో జరిగిన అభివృద్ధితో దేశంలో జనాభావృద్ధి కన్నా వ్యవసాయరంగంలో వృద్ధి ముందంజలో ఉందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం విరివిగా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్తు సవాళ్ళను అథిగమించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సెన్సాకేర్ మేనేజింగ్ పార్టనర్ వినోద కుమార్, పరిశోధన సంచా లకులు డాక్టర్ జగదీశ్వర్, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ అధ్యక్షుడు డాక్టర్ శర తాబాబు, అగ్రిహబ్ ఎండి డాక్టర్ కల్పనాశాస్త్రితోపాటు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల యూనివర్సిటీ శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు. PJTSAU