వార్తలు

కాశ్మీర్ లో తులిప్ వనం ప్రారంభం..స్వాగతం పలుకుతున్న15 లక్షల తులిప్ మొక్కలు

0

భారతదేశంలోని అందాల సుందర లోయ కాశ్మీర్ లో తులిప్ పువ్వులు విరబూశాయి. అక్కడ అందాలను చూడడానికి రమ్మనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలికారు. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం వీక్షకుల కోసం ఈ రోజు ప్రారంభం కానుంది. తులిప్ గార్డెన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మోడీ షేర్ చేశారు. గార్డెన్ కు సంబంధించిన విశేషాలను వివరిస్తూనే పర్యాటకులను “కశ్మీర్ చూదాం రండి” అంటూ ఆహ్వానం పలికారు.
మార్చి 25 జమ్మూకశ్మీర్ కు ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ.. శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వత ప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ధ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ అందాలతో పాటు జమ్మూకాశ్మీర్ ప్రజల కమ్మని ఆతిధ్యాన్ని కూడా మీరు స్వీకరిస్తారు అంటూ మరో ట్వీట్ చేశారు. గార్డెన్ కే సంబంధించిన ఫోటోలను కూడా మోడీ తన ట్వీట్ లో షేర్ చేశారు. కాగా అధికారికంగా సిరాజ్ బాగ్ గా పిలువబడే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ను 2008 అప్పటి జమ్మూకాశ్మీర్ సీఎం గులాంనబీ ఆజాద్ పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించారు. తులిప్ గార్డెన్ నాలుగు దిక్కులా ఎటు చూసినా తులిప్ పువ్వులే మనకు దర్శనమిస్తాయి. తెలుపు, పసుపు, పింక్ .. ఇలా రకరకాల రంగుల్లో ఆకాశం నుంచి చూస్తే ఇంద్ర ధనుస్సు నేల మీద విరిసిందా.. అన్నట్లుగా ఆ తులిప్స్ తమ అందమంతా తమలోనే దాగుందన్నట్లు పర్యాటకుల చూపును తమవైపు తిప్పుకుంటాయి. వాటిని చూసేందుకు నిజంగా మన రెండు కాళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు. శ్రీనగర్ లోని దాల్ లేక్ సమీపంలో జబర్వాన్ రేంజ్ లోని పర్వతసానువుల్లో ఈ గార్డెన్ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్ లలో ఒకటి కావడం విశేషం. ఇక కరోనా వైరస్ ప్రభావం జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్రంగా చూపించింది. దీంతో జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగం మళ్ళీ కాశ్మీర్ పర్యాటక రంగానికి ఊపు తెచ్చే విధంగా ప్రచార కార్యక్రమం చేపట్టడానికి రెడీ అయ్యింది. ఈ తరుణంలో తులిప్ గార్డెన్ ను చూడడానికి రమ్మనమని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునివ్వడం కొత్త ఊపునిచ్చినట్లైంది.

Leave Your Comments

మెగ్నీషియంతో నిద్రలేమి సమస్య దూరం.. 

Previous article

వేసవికాలంలో తాగే టీ రకాలు..

Next article

You may also like