వార్తలు

రాష్ట్ర వ్యవసాయ శాఖకు నిధులు విడుదల…

0
TS Govt

Telangana Agriculture

TS Govt Releases Pending Amount For Agriculture Department రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయ శాఖను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ఒకటి. ఈ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్లో భాగంగా 60 శాతం బకాయిలు చెల్లిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పెంచి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అందిస్తుంది. అయితే 2016-17 నుంచి 2019-20 సంవత్సరానికి గానూ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర వాటాను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వ్యవసాయ శాఖకు రూ.372.34 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు బీఆర్వో విడుదల చేశారు. Telangana Agriculture

Leave Your Comments

గోశాలను సందర్శించిన సీఎం జగన్..

Previous article

జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ?

Next article

You may also like