TS Agri Minister Niranjan Reddy: రైతుబంధు, పంటల సాగు, ఎరువుల ధరలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్పందించారు.
నిర్మలమ్మా ఇన్ని అబద్దాలా ?
రైతుల పట్ల మోడీది అంకితభావమా ?
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ హామీ ఏమయింది ?
రైతుల సాగు పెట్టుబడిని రెట్టింపు చేసింది నిజం కాదా ?
ఎరువులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు
ఎరువుల ధరలు పెంచింది మీరు కాదా ?
రూ.1200 డీఎపీ రూ.1900, రూ.850 ఎంవోపీ (పొటాష్) రూ.1700, రూ.1200 ధర ఉన్న 24.24.0.18 ని రూ.1900 కు పెంచారు. తొమ్మిది విడతలలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.57,880 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడు విడతల్లో ఇచ్చే ఆరు వేలు అందేది 33 లక్షల మంది రైతులకే. రైతుభీమా పథకం కింద 86,667 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4333.35 కోట్ల పరిహారం అందింది.
ఉచిత కరంటు, సాగునీటితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు అనుకూల విధానాలతో తెలంగాణ రైతులు దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండిస్తే రాజకీయ కక్ష్యతో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది వాస్తవం కాదా ? వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తానన్న మోడీ అధికారం దక్కాక దాని ఊసెత్తడం లేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని మోసం చేశారు. పండిన పంటలలో కేవలం 25 శాతం మాత్రమే మద్దతు ధరలకు కొనుగోలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు.

TS Agri Minister Niranjan Reddy
నల్లచట్టాలు తెచ్చింది మోడీ కాదా ? రైతుల ఉద్యమం మీద ఉక్కు పాదం మోపింది మోడీ కాదా ?
రైతుల నిరసనకు జడిసి క్షమాపణ చెప్పి చట్టాలు రద్దు చేస్తున్నట్లు చెప్పింది మోడీ కాదా ?
రద్దు చేసిన సంధర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నది మోడీ కాదా ?
60 ఏండ్లు నిండిన ప్రతి రైతుకు ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మాట వాస్తవం కాదా ?
భారీ వర్షాలు తెలంగాణ, గుజరాత్ ను ముంచెత్తితే గుజరాత్ నిధులిచ్చి తెలంగాణకు ఇవ్వకుండా వివక్ష చూపింది నిజం కాదా ?
తెలంగాణ ఎంతో చైతన్యవంతమైన నేల. ఈ నేల మీద అబద్దాలతో ప్రజలను ఏమార్చవచ్చని ఆశించడం హస్యాస్పదం.
తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు దేశంలోని ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా అమలవుతున్నాయా ? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్పందించారు.
Also Read: TS Agri Minister Niranjan Reddy: కొల్లిపరలోని అరటిసాగును పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి.!