యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం తారాస్థాయికి చేరింది. ఈ మేరకు అధికార పార్టీ తెరాస కేంద్రంతో పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగా నేడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సేలు , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాలలోకి వెళితే…( TRS Ministers Met Governor Tamilisai at Rajbhavan )
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారికి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు , మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
మహాధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశాం అని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగింది అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర గవర్నర్ గా ఇది మీరు సంతోషించాల్సిన అంశం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుంది అని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం వారికి నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దం అని తేల్చిచెప్పారు. ( TRS Ministers Met Governor Tamilisai at Rajbhavan )
Also Read: మిరపలో తామర పురుగులకు నివారణ చర్యలు…