వార్తలు

భగ్గుమన్న టమోటా ధరలు..!

0
Tomato Prices

Tomato Prices Rise Due To Rains కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో దీని తీవ్రత ఉదృతంగా కొనసాగుతుంది. దీంతో లక్షల ఎకరాలు నీటమునిగాయి. ఆ ప్రభావం ప్రస్తుతం కూరగాయలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో పంట దిగుబడి బాగా తగ్గింది అందులోనూ టమోటా దిగుబడి మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా టమోటా ధరలు ఎగబాకాయి. టమాటకు అతి పెద్ద విపణి అయిన కోలారు ఎపిఎంసి మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. Tomato Prices Hike

Tomato Price

పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వానల కారణంగా టమాట దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు సరుకు కోసం కోలారు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్‌ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక బయట కూరగాయల మార్కెట్లలో కేజీ ధర నాణ్యతను బట్టి రూ.70– 80 వరకూ ఉంటోంది.

Tomato Prices Rise

Tomato Prices Riseపది రోజుల క్రిందటి వరకు కొనేవారు లేక రోడ్ల పక్కన పడబోసిన టమోటా ప్రస్తుతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంది. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం రైతుల దగ్గర టమాట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, చిత్తూరు, అనంతపూర్‌ తదితర ప్రాంతాల నుంచి దళారులు దిగుమతి చేసుకొని తమ ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. రైతులకు టమాట బాక్స్‌ ధర రూ.1000 చెల్లించి చేతులు దులుపుకుని అదే బాక్స్‌ను రూ.1500లకు విక్రయిస్తున్నారు.

Leave Your Comments

టెర్రెస్ గార్డెనింగ్ పై ఆసక్తి ఉందా..సంప్రదించగలరు!

Previous article

కొలంబో కందితో లక్షల్లో ఆదాయం…

Next article

You may also like