tomato price hits Rs 100 in ap దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. కొద్దీ రోజుల క్రితం పదుల్లో ఉండే టమోటా ధరలు ప్రస్తుతం ఆకాశానంటేశాయి. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు సెంచరీ దాటేసింది. పెట్రోల్ రేట్లతో అల్లాడిపోతున్న వినియోగదారులకి టమోటా కూడా తోడవ్వడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలికింది.
ఇటీవల అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో కూరగాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. ఇక ఒక్క టమోటా మాత్రమే అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో మార్కెట్ కి వెళ్లాలంటేనే హడిలిపోతున్నారు వినియోగదారులు. కరోనాతో ఇప్పటికే ఆర్థికంగా బలహీన పడిన సామాన్యులకు తాజాగా పెరుగుతున్న కూరగాయల రేట్లను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ధరలు ఇలానే కొన్నాళ్ళు కొనసాగుతాయని చెప్తున్నారు మార్కెట్ యాజమాన్యాలు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దిగుబడి తగ్గడం, డిమాండ్ కు తగ్గ పంట లేకపోవడం వల్లనే కూరగాయల రేట్లు భారీగా పెరిగాయని చెప్తున్నారు. tomato price hits Rs 100 in ap
కర్నూలులో పత్తికొండ, మద్దికెర, పీపల్లీ, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, ధోనే, కోడుమూరు మండలాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఈ మండలాల్లో 15,000 నుంచి 16,000 హెక్టార్లలో పంట సాగైంది. నెల క్రితం కనీసం కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు సందర్భాల్లో రైతుల టమోటాని రోడ్లపై పారబోశారు. కానీ తాజా వర్షాల కారణంగా ఒక్కసారిగా టమోటాకి రెక్కలొచ్చాయి. టమోటాలకు వ్యవసాయ మార్కెట్లో మంచి గిరాకీ వస్తోంది.