వ్యవసాయానికి సంబంధించి ఏ పని చేయాలన్న ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్ కు తరలించడం వరకు అన్నింటికీ టాక్టరే కీలక పాత్ర పోషిస్తుంది. ఐతే ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ తో నడిచే ట్రాక్టర్లు వున్నాయి.. పెరుగుతున్న ధరలతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు ఆదాయం పెంచేలా కేంద్రం సీఎన్జీ ట్రాక్టర్ల ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. సాగు కోసం మార్పులు చేసి తొలి సీఎన్జీ ట్రాక్టర్ ను ఆవిష్కరించబోతుంది. కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యం లో ఈ విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. డీజిల్ ట్రాక్టర్ ను.. సిఎన్జీ గా మార్పులు చేయనున్నారు. “రామ్యాట్ టెక్నో సొల్యూషన్స్” , “టొమాసెటో ఆచిల్ ఇండియా” సంస్థలు సంయుక్తంగా ఈ కన్వర్షన్ విధానాన్ని చేపట్టనున్నాయి. ఈ విధానం ద్వారా రైతులకు ట్రాక్టర్ల పై పెట్టే ఇంధన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా వారికి ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ విధానం ద్వారా రైతులు ఏడాదికి ఇంధన ఖర్చులపై లక్ష రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు అని కేంద్రం తెలిపింది.
సీఎన్జీ ట్రాక్టర్ తో ప్రధానంగా మూడు లాభాలున్నాయి. దీనికి డీజిల్ తో నడిచే ట్రాక్టర్ తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్తో పోల్చితే 70 శాతం తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్ పై పెట్టె ఖర్చు లో 50 శాతం తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 80 – 84 వరకు వుంది. అదే కేజీ సీఎన్జీ ధర రూ. 42 మాత్రమే కూడా ఎక్కువగా హాని జరగదు.
సీఎన్జీ చాలా పరిశుభ్రమైన, నాణ్యమైన ఇంధనం. ఇందులో కార్బన్ ఇతర కాలుష్య కారకాలు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉంటాయి.