SRSP Project 60 Years: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంటల సాగుకు ఆధారంగా ఉన్న ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి, దీనిని ఒక దేవాలయం గా అభివర్ణించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి దీనిని ప్రారంభించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తో దీన్ని నిర్మించారు.
1983లో టీడీపీ సర్కారు హయాంలో
60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తోంది. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసి 1988లో దానిని పూర్తిచేసి ప్రారంభించారు. ప్రసుత్తం భారీగా కురిసిన వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. లక్షా 25 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1085 అడుగుల నీటిమట్టం ఉంది.
Also Read: Sugar Mills: చక్కెర కర్మాగారాలకు నష్టాలా? వ్యర్థపదార్థాల ద్వారా వచ్చే ఆదాయం?
ప్రాజెక్టుపై ప్రధాని నెహ్రూ విగ్రహం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర లాల్ నెహ్రూ దీనికి పునాది రాయి వేసాడు. 1978లో ప్రాజెక్ట్ ను పూర్తి చేయగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించాడు.
ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలవలను నిర్మించారు. ఈకాలవల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించే వారు. దీని ద్వారా ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ప్రాజెక్టు గుర్తుగా 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పై భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహన్ని కట్టించారు. నేటికి శంకుస్థాపన జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగులు, ఇంజనీరింగ్ అధికారులు ఉత్సవాలు, వేడుకలు చేస్తున్నారు.
Also Read: Pond Water Quality Management: చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతులు