వార్తలు

షీప్ ఫామింగ్ వైపు తెలంగాణ పశు సంవర్ధక శాఖ చూపు..

0

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోళ్లు, పాడి పశువులు, గొర్రెల పెంపకంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల ఫామ్ లు, డెయిరీ ఫామ్ ల సంస్కృతి విస్తృతం కాగా తాజాగా గొర్రెల పెంపకం కూడా అదే దారిలోకి వెళ్తున్నది. గొర్రెలను చెలకల్లో తిప్పి పెంచేవారు తగ్గిపోతున్నారు. గొర్రెలకు ప్రత్యేకంగా ఫామ్ లు నిర్మించి పెంచే సంస్కృతి పెరుగుతున్నది. తెలంగాణ పశు సంవర్ధకశాఖ కూడా ఇదే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే గొల్ల కురుమలకు సబ్సీడీపై గొర్రెలను పంపిణీ చేస్తుండగా దీనికి అదనంగా మండలానికి ఒకటి రెండు చొప్పున షీప్ ఫామ్ లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లో నిరుద్యోగ గొల్ల కురుమ యువకులను ఎంపిక చేసి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందితో ఒక యూనిట్ ఏర్పాటు చేసి సబ్సీడీపై గొర్రెలను అందించాలని యోచిస్తున్నారు. ఒక్కో ఫామ్ కు 100 – 150 గొర్రెలను పంపిణీ చేయాలనేది ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను త్వరలోనే ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. షీప్ ఫామింగ్ ను ప్రోత్సహించడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వినియోగదారులకు నాణ్యమైన మాంసం తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. సాధారణ పద్దతితో పోల్చితే షీప్ ఫామింగ్ విధానంలో గొర్రెల నుంచి ఎక్కువ మాంసం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గొర్రెల పెంపకందారులు తక్కువ బరువు ఉండగానే గొర్రెలను విక్రయిస్తున్నారు. ఫామింగ్ విధానంలో అయితే ఎక్కువ బరువు వచ్చే వరకు పెంచవచ్చని అధికారులు అంటున్నారు.

Leave Your Comments

ఎక్కువ ధర రావాలంటే టమాటా సాగు ఎప్పుడు చేయాలి..

Previous article

నిప్పులు కురుస్తున్నఎండలు మన మంచికే అంటా..

Next article

You may also like