ఢిల్లీ కాలుష్యం కొనసాగుతుంది. కొన్ని రోజులుగా దేశ రాజధాని హస్తినలో పొగ, దుమ్ము, ధూళి కమ్ముకుంది. దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వాయు కాలుష్యంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా సుప్రీం కోర్ట్ ఘాటుగా స్పందించింది.
పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. రైతులపై తాము ఎటువంటి ఆంక్షలు విధించబోమని కోర్టు చెప్పింది. రైతుల్ని శిక్షించడం తమ విధి కాదు అని పేర్కొంది. రైతుల బాధల్ని అర్థం చేసుకోవాలని, వాళ్లెందుకు పంట వ్యర్ధాలను దగ్ధం చేస్తున్నారని, వాటి గురించి ఆలోచించేవాళ్లు లేరని, ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటళ్లలో నిద్రపోయేవాళ్లు కూడా రైతుల్ని నిందిస్తున్నారని, చిన్న చిన్న పొలాలు ఉన్న రైతులు .. వ్యర్ధాల తొలగింపునకు మెషిన్లు ఎలా కొనగలరని జస్టిస్ సూర్య కాంత్ ప్రశ్నించారు.
ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టుకు కేంద్రం మూడు దశలను సూచించింది. బేసి-సరిసంఖ్యల వాహన పథకాన్ని ప్రవేశపెట్టడం, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడం, లాక్‌డౌన్ విధించడం లాంటివి చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది.
#SupreemCourt #Delhi #DelhiPollution #Farmers #Eruvaaka